సిద్దిపేట జిల్లాలో చిరుతను చంపి జైలుపాలయ్యారు వేటగాళ్లు. దౌల్తాబాద్‌కు చెందిన నలుగురు వేటగాళ్లు వన్యప్రాణుల కోసం ఉచ్చు ఏర్పాటు చేశారు. అయితే, ఈ ఉచ్చులో చిరుత చిక్కడంతో పంట పండిందని భావించారు. చిరుతను కొట్టి చంపి దంతాలు, చర్మం అమ్మి సొమ్ము చేసుకోవచ్చని ఆశ పడ్డారు. దీంతో చిరుతను కొట్టి చంపి దహనం చేశారు. అయితే, విషయం బయటకు పొక్కడంతో పోలీసుల చేతికి చిక్కారు. వన్య ప్రాణులను వేటాడటం నేరం కావడంతో నలుగురు వేటగాళ్లైన సాయి కుమార్, ఎల్లం, రాములు, నరసింహులుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడ్డ కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు అడవి శాఖ అధికారి డిఎఫ్ఓ శ్రీనివాస్.


