Crime | హైదరాబాద్ లో ఘోర ఘటన కలకలం రేపుతోంది. సనత్ నగర్‌లోని నాలాలో ఓ బాలుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతదేహాన్ని గమనించిన స్థానికులు… బాలుడిని నరబలి ఇచ్చి ఉంటారని ఆరోపణలు చేస్తున్నారు. ఓ హిజ్రాపై వారు ఆరోపణలు చేస్తూ ఈ దారుణానికి ఒడిగట్టిందని తన ఇంటిపై దాడి చేశారు. మృతి చెందిన బాలునికి సుమారు 8 ఏళ్ల వయస్సు ఉంటుందని స్థానికులు అంటున్నారు. సనత్‌నగర్‌లోని అల్లాదున్ కోటి ఏరియాలోనే ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.