24.1 C
Hyderabad
Tuesday, July 1, 2025
spot_img

గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. ఒకటో తేదీ షాక్

స్వతంత్ర వెబ్ డెస్క్: నెల ఒకటో తేదీనే వంట గ్యాస్ వినియోగదారులకు షాక్ తగిలింది. 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ రేటు భారీగా పెరిగింది. ఈ సిలిండర్ ధర ఏకంగా రూ. 209 మేర పెంచుతూ ఆయిల్ మార్కెంటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెంపు తక్షణమే అమల్లోకి వచ్చింది. అయితే గృహోపయోగాలకు వినియోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు చేయకుండా సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఊరట కలిగించాయి. కానీ, పండుగ సీజన్ ముంగిట వాణిజ్య సిలిండర్ ధరలు పెరగడం అందరిపై ప్రభావం పడనుంది. తాజా పెంపు తర్వాత ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ. 1731.50కి చేరింది. కోల్‌కతాలో రూ. 1839కి చేరగా.. హైదరాబాద్‌లో ఏకంగా రూ. 1956.50కు చేరుకుంది. విజయవాడలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ రేటు రూ.1888.50గా ఉంది..

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్