స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలోని గడ్చిరౌలీలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. స్థానికంగా క్యాంపును ఏర్పాటు చేస్తున్న సమయంలో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. దీంతో నక్సల్స్ దాడికి దిగారు. గడ్చిరోలిలోని భమ్రాఘర్ యాంటీ నక్సల్స్ సీ-60 పోలీస్ స్క్వాడ్ ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలో దామ్రేచా, మన్నెరాజారాం అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో పెర్మిలి దళ కమాండ్ బిట్లు మాధవితో సహా ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మన్నెరజరం అడవుల్లో మొత్తం 25 మంది మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.