స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ లోని తూర్పు మేదినీపూర్ జిల్లా ఏగ్రాలో విషాదం నెలకొంది. ఖాధీకుల్ గ్రామంలోని బాణాసంచా పరిశ్రమలో బాణాసంచా తయారుచేస్తుండగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో మొత్తం ఏడుగురు మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయాలయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. పేలుడు సంభవించడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.