స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: సెలబ్రెటీలు ఏం చేసినా విశేషమే. ముఖ్యంగా సినిమా వాళ్లు చేసే ప్రతి పని అభిమానులను కనువిందు చేస్తూనే ఉంటుంది. వాళ్లు ఏ యాడ్ చేసినా, ఏ షోరూమ్ ఓపెన్ చేసినా భారీగా పారితోషికం పుచ్చుకుంటారు. ఇక హిందీ పరిశ్రమకు చెందిన అగ్రహీరోలైతే వీటితో పాటు వివాహ కార్యక్రమాలకు హాజరై అక్కడ డ్యాన్స్ షోలు చేస్తూ ఉంటారు. ఇందుకోసం కోట్లలోనే అందుకుంటారని సమాచారం.
తాజాగా బాలీవుడ్ అందగాడు హృతిక్ రోషన్ ఓ వివాహ వేడుకలో సందడి చేశాడు. తన సినిమాల్లోని పాపులర్ సాంగ్స్‌కు అదిరిపోయే స్టెప్స్ తో అలరించాడు. ఇందుకుగానూ ఏకంగా రూ.2.5కోట్లు తీసుకున్నాడని ముంబై ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. గంట, రెండు గంటల పర్ఫార్మెన్స్‌కు ఇంత భారీ మొత్తంలో రెమున్యూరేషన్ తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. మే ఒకటో తేదీన జరిగిన ఆ వేడుకలో హృతిక్ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#WATCH: Hrithik Roshan dances at wedding, joins bride and groom on stage; fan says 'if it happened to me I'd forget my husband'#HrithikRoshan #Wedding #TrendingNow #Trending #Dance #TrendingVideo pic.twitter.com/MlYHbQT3Ro
— HT City (@htcity) May 1, 2023