26.6 C
Hyderabad
Sunday, March 1, 2026
spot_img

మూసీ సుందరీకరణ ఎలా చేస్తారు – కిషన్‌రెడ్డి

హైడ్రా కొత్తేదేమీ కాదని అక్రమంగా చేపట్టే నిర్మాణాలను గతంలో జీహెచ్ఎంసీ కూల్చివేసేదని.. ఇప్పుడు దానికి పేరు మార్చి హైడ్రా పెట్టారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైడ్రాపై తొందరపాటు నిర్ణయాలు తగదని.. దుందుడుకు నిర్ణయాలు సరికావని హెచ్చరించారు. నాంపల్లిలోని పార్టీ ఆఫీస్‌లో చిట్ చాట్‌ నిర్వహించిన కిషన్‌రెడ్డి.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. డీపీఆర్ లేకుండా కూలగొడితే ఎలా? కూలగొట్టిన వాటికి బ్యాంక్ ఈఎంఐలు ఎవరు కట్టాలని నిలదీశారు. పేద ప్రజల ఇల్లు కూల్చమని తమ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు చెప్పలేదన్నారు. హైడ్రా ఏమైనా భూతమా? అని నిలదీశారు. మూసీ పరివాహక ప్రాంతంలో 40 ఏళ్లుగా నివాసం అంటున్న వారికి ప్రభుత్వమే అన్ని వసతులు కల్పించి ఇప్పుడు కూల్చివేస్తామనడం సరికాదని మండిపడ్డారు. మూసీ పరివాహక ప్రాంతంలో ధనవంతులు ఎవరు ఉండరని అంతా పేదవారే ఉన్నారన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్