26.2 C
Hyderabad
Thursday, October 23, 2025
spot_img

గాండీవ‌ధారి అర్జున‌.. వరుణ్‌ తేజ్‌ నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఎలా ఉందంటే..?

స్వతంత్ర వెబ్ డెస్క్: ఘోస్ట్ సినిమాతో దర్శకుడిగా ప్రవీణ్ సత్తారు ఫ్లాప్ అయ్యాడు. గని సినిమాతో వరుణ్ సైతం డీలా పడ్డారు. ఇలా ఈ ఇద్దరూ కలిసి గాండీవధారి అర్జున అనే సినిమాతో వస్తుండటంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్ కూడా ఆసక్తిని పెంచేశాయి. మరి ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ కథ, కథనాలు ఏంటి? ఎలా ఉందనేది ఓ సారి చూద్దాం.

భారత్‌కు చెందిన పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య రాజ్ (నాజర్) లండన్‌లో జరిగే యూఎన్ క్లైమేట్ సమావేశాలకు వెళ్తాడు. మంత్రి పీఏగా ఐరా (సాక్షి వైద్య) ఉంటుంది. అక్కడ యూనివర్సిటీకి చెందిన ఓ అమ్మాయి మంత్రిని కలిసి ‘ఫైల్ 13’ గురించి చెప్పాలని అనుకుంటుంది. ఆ ‘ఫైల్ 13’ కోసం క్లీన్ అండ్ గ్రీన్ (సీ అండ్ జీ)కంపెనీ అధినేత రణ్వీర్ (వినయ్ రాయ్) ప్రయత్నిస్తాడు. తన కంపెనీ సీక్రెట్లు అందులో ఉండటంతో దాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తాడు. అసలు ఆ ఫైల్‌లో ఏముంది? రణ్వీర్‌కు మంత్రికి ఉన్న సంబంధం ఏంటి? ఈ కథలోకి అర్జున్ వర్మ (వరుణ్ తేజ్) ఎలా వస్తాడు? అర్జున్ వర్మ, ఐరా (సాక్షి వైద్య)కి ఉన్న రిలేషన్ ఏంటి? చివరకు అర్జున్ వర్మ ఏం చేశాడు? అనేది కథ.

ఈ సినిమా ఎక్కడా కూడా కొత్తగా అనిపించదు. తెరపై లగ్జరీ కనిపిస్తుంది. కానీ కథలో ఎమోషన్ కనిపించదు.తల్లీకొడుకు ఎమోషన్ వర్కౌట్ అవ్వదు.. హీరో హీరోయిన్ ట్రాక్‌లోనూ ఎమోషన్ కనిపించదు.. ఇలా ఏ పాత్రను కూడా సరిగ్గా వాడుకోలేదనిపిస్తుంది. ఏ ఒక్క పాత్రకు కూడా ఆడియెన్ కనెక్ట్ అవ్వడు. సీన్లకు ప్రేక్షకుడు కనెక్ట్ అవ్వడం పక్కన పెడితే.. ఎన్నో లాజిక్ లేని సన్నివేశాలు కనిపిస్తాయి. ఇంటర్ పోల్ అధికారులు హీరోను పట్టుకోవడంలో చూపించే శ్రద్ద, వేగం.. విలన్‌ను పట్టుకోవడంలో చూపించరు. అసలు ఇంటర్ పోల్ అధికారులు అంతగా హీరో వెనక ఎందుకు పడతారు అన్నది కూడా ఆశ్చర్యం వేస్తుంది. విలన్‌ను ఎంతో భయంకరంగా చూపిస్తారని అనుకుంటాం. కానీ చివరకు హీరో ఆ విలన్లను టపీటపీమని కాల్చుకుంటూ వెళ్తూనే ఉంటాడు. చివరి వరకు తన స్థావరానికి హీరో వచ్చాడని కూడా విలన్ కనిపెట్టలేకపోతాడు. ఇలా ఎన్నో సీన్లు ప్రేక్షకుడు తలపట్టుకునేలా ఉంటాయి.

అసలు హీరో చేసేది ఏ పని.. ఏ డిపార్ట్మెంట్.. ఆర్మీ, రా.. ప్రైవేట్ ఏజెన్సీ ఇలా ఏంటన్నది కూడా క్లారిటీగా అనిపించదు. చాలా చోట్ల క్లారిటీ మిస్ అయినట్టుగా అనిపిస్తుంది. ఈ సినిమా కోసం ప్రవీణ్ సత్తారు ఎంచుకున్న పాయింట్ ఆలోచింపజేసేదే అయినా.. తెరపై ఆకట్టుకునేలా, అందరూ మెచ్చేలా, ప్రశంసించే సినిమాగా మాత్రం మలచలేకపోయినట్టు అనిపిస్తుంది. టెక్నికల్‌గా ఈ సినిమా మెప్పిస్తుంది. మిక్కీ పాటలు గుర్తుండకపోయినా ఆర్ఆర్ ఆకట్టుకుంటుంది. కెమెరా వర్క్ బాగుంది. చేజింగ్ సీన్లు బాగా అనిపిస్తాయి. తక్కువ నిడివి కలిసి వస్తుంది. సినిమా కోసం నిర్మాతలు బాగానే ఖర్చు పెట్టినట్టుగా అనిపిస్తుంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్