26.7 C
Hyderabad
Sunday, June 16, 2024
spot_img

Horoscope Today |ఈరోజు అదృష్టం అంటే ఈ రాశుల వారిదే.. ధన లాభం ఎవరికంటే..

Horoscope Today |ఎక్కువ మంది జాతకాలను, రాశి ఫలాలను నమ్ముతుంటారు. ప్రతిరోజూ రాశి ఫలాలు ఒకేలా ఉండవు. ఒకోరోజు ఒకోలా ఉంటాయి. అందుకే ఆరోజు తన జాతకం ఎలా ఉందో చూసుకున్న తర్వాత మాత్రమే ఏ పనైనా ప్రారంభిస్తారు. శుక్రవారం ఏ రాశివారికి అదృష్టం కలిసొస్తుంది.. ధనలాభం ఎవరికి.. ఏ రాశి వారి జాతకం ఎలా ఉందో తెలుసుకుందాం.

Horoscope Today | మేషం: ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా గడుపుతారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో ఎక్కువుగా సంతోషిస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు.

వృషభం: ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. సన్నిహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు, సూచనలిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్యసాహసాలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. శుభవార్తలు వింటారు.

మిథునం: మీ ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నూతన, వస్తు, వస్త్ర ఆభరణాలను పొందుతారు.

కర్కాటకం: రుణప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్య సమస్య ఉంటాయి. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. చేసే పనులలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

సింహ రాశి: మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం ఎంతో అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణవల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టే కార్యాలకు దూరంగా ఉంటారు.

కన్య రాశి: ఈ రాశి వారికి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభంతో అప్పుల సమస్యలు తొలగిపోతాయి. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషిచేస్తారు. స్త్రీలు, బంధు, మిత్రులను కలుస్తారు.

తుల రాశి: బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మానసిక ఆందోళనతో కాలం గడుపుతారు. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.

వృశ్చిక రాశి: ఈ రాశి వారు మిక్కిలి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శతృబాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక లాభాలు ఉంటాయి.

ధనుస్సు రాశి: ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఇతరులకు ఉపకారం చేయాలనే ఆలోచనలో ఉంటారు. రుణబాధలు తొలగిపోతాయి.

మకరం: కుటుంబ కలహాలు దూరమవుతాయి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. అందరితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి.

కుంభ రాశి: కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుతారు. ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నులవుతారు. స్త్రీలమూలకంగా లాభం ఉంటుంది. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. రుణబాధలు తొలగుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది.

మీన రాశి: ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు. అనవసర వ్యయప్రయాసల వల్ల ఆందోళన చెందుతారు. వృథా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీల మూలకంగా ధనలాభం ఉంటుంది.

Read Also: బంగారం కొనాలనుకుంటున్నారా.. ప్రధాన నగరాల్లో ఇవాల్టి ధరలివే.

Follow us on:  Youtube

Latest Articles

నవ్విస్తూ, భయపెట్టిన OMG (ఓ మంచి ఘోస్ట్) ట్రైలర్

వెన్నెల కిషోర్, నందితా శ్వేత ప్రధాన పాత్రల్లో నటించిన హారర్, కామెడీ ఎంటర్‌టైనర్ OMG (ఓ మంచి ఘోస్ట్). మార్క్ సెట్ నెట్‌వర్క్స్ బ్యానర్ మీద డా.అబినికా ఇనాబతుని నిర్మించిన ఈ చిత్రానికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్