స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: బీజేపీ నాయకత్వంపై టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లు రవి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పార్టీ పుట్టకముందే హిందు మతం ఉందన్నారు. అన్ని పార్టీలలో హిందువులు ఉన్నారని వ్యాఖ్యానించారు. హిందువులు అంటే బీజేపీ ఒక్కటే కాదని.. బీజేపీ మతం అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తూ హిందువుల మధ్య చిచ్చు పెడుతుందని అన్నారు. మతాలను రాజకీయాలకు వాడుకోవడం శోచనీయం మని వ్యాఖ్యానించారు.