33.2 C
Hyderabad
Monday, February 3, 2025
spot_img

హిందూపురం మున్సిపాలిటీ టీడీపీ కైవసం..తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా

హిందూపురం మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్‌గా ఆరో వార్డు కౌన్సిలర్‌ డి.ఈ. రమేష్ కుమార్ ఎన్నికయ్యారు. ఉత్కంఠ నడుమ వైసీపీ, టీడీపీ మధ్య హోరా హోరిన చైర్మన్ ఎన్నిక జరిగింది. ఓటింగ్‌లో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎంపీ పార్థసారథి పాల్గొన్నారు.

టిడిపి తరఫున 21 మంది కౌన్సిలర్లు వైసీపీ తరఫున 14 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. ముగ్గురు వైసీపీ కౌన్సిలర్లు ఎన్నికకు డుమ్మా కొట్టారు. 40 మంది సభ్యులున్న కౌన్సిల్‌లో 23 మంది మద్దతు పలకడంతో మున్సిపల్‌ చైర్మన్‌గా రమేశ్‌ ఎన్నికయ్యారు. వైసిపి బలపరిచిన లక్ష్మికి 14 మంది కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రొసీడింగ్ ఆఫీసర్ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో ఆరో వార్డు కౌన్సిలర్ డి.ఈ.రమేష్ కుమార్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ డి ఈ రమేష్ కుమార్ నందమూరి బాలకృష్ణకు, ఎంపీ పార్థసారథి కు కౌన్సిలర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ.. గత టిడిపి హయాంలో హిందూపురం మున్సిపాలిటీకి వందల కోట్లు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో సిమెంట్ రోడ్ల విస్తీర్ణ పనులను శరవేగంగా పూర్తి చేస్తామన్నారు.

తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. కోరం లేనందున వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు. సమావేశానికి 23 మంది టీడీపీ కార్పొరేటర్లు హాజరుకాగా… కోరంకి మరో ముగ్గురు సభ్యులు కావాల్సి ఉంది. కోరం లేకపోవడంతో వాయిదా వేశారు. ఇక తమ కార్పొరేటర్లను టీడీపీ కిడ్నాప్ చేసిందని వైసీపీ ఆరోపించింది. 8 మంది కార్పొరేటర్లను ఎత్తుకెళ్లారని విమర్శించింది వైసీపీ.

మరోవైపు ఎస్వీ వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ కార్యకర్తలు సెనెట్‌ హాల్‌కు చేరుకుని ఆందోళన చేపట్టారు. తిరుపతిలో మున్సిపల్‌ ఎన్నికల సందర్బంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓటింగ్‌ కోసం ఎస్వీ యూనివర్సిటీకి వెళ్తున్న సమయంలో కార్పొరేటర్ల బస్సుపై జనసేన, టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు. వైసీపీ కార్పొరేటర్లపై టీడీపీ, జనసేన నేతలు దాడి చేశారు. ​కార్పొరేటర్లు వెళ్తున్న బస్సుపై జనసేన, టీడీపీ కార్యకర్తల రాళ్ల రువ్వడంతో బస్సు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కార్పొరేటర్లను బలవంతంగా ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో, అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
కూటమి నేతలకు పోలీసులు సహకరిస్తున్నారని తిరుపతి ఎంపీ గురు మూర్తి, నగర మేయర్ శిరీష ఆరోపించారు. పోలీసులే రక్షించకపోతే మమ్మల్ని ఎవరు రక్షిస్తారంటూ నిలదీశారు. తాము ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? అని ప్రశ్నించారు. మహిళా కార్పొరేటర్‌ అని కూడా చూడకుండా దాడి చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

Latest Articles

బడ్జెట్‌లో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది – ఎమ్మెల్యే కడియం శ్రీహరి

పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని.. దానికి నిరసనగా జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్