27.2 C
Hyderabad
Thursday, November 21, 2024
spot_img

‘కంగువ’లో ఒక సర్‌ప్రైజింగ్ క్యారెక్టర్ ఉంది: డైరెక్టర్ శివ

స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కంగువ’ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ‘కంగువ’ సినిమా ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో ‘కంగువ’ మూవీ హైలైట్స్ తెలిపారు దర్శకుడు శివ

– తెలుగు చిత్ర పరిశ్రమలో నా ప్రయాణం మొదలైంది. ప్రేమంటే ఇదేరా సినిమాకు అసిస్టెంట్ కెమెరామెన్ గా వర్క్ చేశాను. ఆ తర్వాత ఎడిటింగ్ నేర్చుకున్నాను. చిన్నప్పటి నుంచి సాహిత్యం చదవడం అలవాటు. అలా రైటింగ్ మీద ప్యాషన్ ఏర్పడింది. ఇప్పటిదాకా 9 చిత్రాలకు డైరెక్షన్ చేశాను. కంగువ దర్శకుడిగా నా పదో సినిమా.

– స్టూడియో గ్రీన్ సంస్థలో నేను గతంలో సిరుతై అనే సినిమా రూపొందించాను. ఆ తర్వాత సుదీర్ఘ విరామం అనంతరం మళ్లీ ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ గారితో కలిసి ‘కంగువ’కు వర్క్ చేశాను. కొన్ని స్క్రిప్ట్స్ జ్ఞానవేల్ గారికి చెప్పినప్పుడు కంగువ వారికి బాగా నచ్చింది. ఈ కథను సూర్య గారికి చెప్పమన్నారు. సూర్య గారిని కలిసి స్క్రిప్ట్ నెరేట్ చేశాను. ఆయన చాలా బాగుంది శివ అంటూ హగ్ చేసుకున్నారు. ఈ మూవీ చేసేందుకు అంగీకరించారు. అలా ‘కంగువ’ జర్నీ మొదలైంది.

– ‘కంగువ’ కోసం రెండున్నరేళ్లుగా వర్క్ చేస్తున్నాం. పర్పెక్ట్ గా ప్రీ ప్రొడక్షన్ ప్లానింగ్ చేసుకున్నాం. త్రీడీలోనూ సినిమా రూపొందించాలని అందుకు తగిన టెక్నికల్ మెథడ్స్ యూజ్ చేశాం. త్రీడీ మూవీస్ లో ‘కంగువ’ ఒక బెస్ట్ మూవీ అవుతుంది.

– ‘కంగువ’ సినిమా కోసం సూర్య గారు పూర్తి సపోర్ట్ ఇచ్చారు. ఉదయం నాలుగు గంటలకే షూటింగ్ కు ప్రిపేర్ అయ్యేవాళ్లం. 7 గంటలకు ఫస్ట్ షాట్ తీసేవాళ్లం. సూర్య గారు మేకప్ కోసం కొన్ని గంటలు వెచ్చించి, కెమెరా ముందుకు వచ్చేవారు. మేము కొండల ప్రాంతంలో షూటింగ్ చేశాం. అక్కడ హిల్ క్లైంబింగ్ చేయాల్సివచ్చేది. సూర్య గారు మాతో పాటు నడుచుకుంటూ వచ్చేవారు. రోజూ షూటింగ్ టైమ్ లో 140 ట్రక్స్ పనిచేసేవి.

– సూర్య గారు కంగువ, ఫ్రాన్సిస్ అనే రెండు పాత్రల్లో కనిపిస్తారు. కంగువ వెయ్యేళ్ల కిందట వీరుడి పాత్ర. ఈ పాత్రకు హద్దులు లేవు, ఎవరూ నియంత్రించలేరు. ఫ్రాన్సిస్ ను కొన్ని అంశాలతో కంట్రోల్ చేయవచ్చు. ఈ పీరియాడిక్ పాత్రతో పాటు మోడరన్ క్యారెక్టర్ లో సూర్య గారి పర్ ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది.

– సూర్య గారు మంచి జిమ్నాస్ట్ అనేది ఎవరికీ తెలియదు. ఆయన మార్షల్ ఆర్ట్స్ తోపాటు బాగా రన్నింగ్ చేయగలరు. ఈ మూవీ షూటింగ్ టైమ్ లో ఆయనకున్న ఫిట్ నెస్ బాగా యూజ్ అయ్యింది. 50 ఏళ్ల వయసులో సూర్య గారు సిక్స్ ప్యాక్ చేయడం మామూలు విషయం కాదు. స్క్రిక్ట్ గా డైట్ ఫాలో అయ్యేవారు, అలాగే వర్కవుట్స్ బాగా చేసేవారు.

– బాబీ డియోల్ గారి వీడియో ఒకటి చూసి ఆయన స్వాగ్ నచ్చి ఈ మూవీలో ఉధిరన్ క్యారెక్టర్ కు ఎంచుకున్నాను. ఉధిరన్ రూత్ లెస్ గా ఉంటాడు. అలాంటి వ్యక్తిత్వమున్న పాత్రకు బాబీ డియోల్ గారి స్వాగ్ ఉంటే కొత్తగా స్క్రీన్ మీద కనిపిస్తుంది అనిపించింది. బాబీ డియోల్ గారు తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ‘కంగువ’కు ఎనర్జీ తీసుకొచ్చారు. ఇది తన కెరీర్ లో చేసిన డిఫరెంట్ అటెంప్ట్ అని బాబీ గారు నాతో చెప్పడం హ్యాపీగా అనిపించింది. దిశా పటానీ చేసిన ఏంజెలీనా క్యారెక్టర్ లో అనేక షేడ్స్ ఉంటాయి. తన క్యారెక్టర్ మూవీకి స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. తనదైన ఎనర్జీని సినిమాకు తీసుకొచ్చింది దిశా పటానీ

– ‘కంగువ’లో ఒక కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించాలని ప్రయత్నించాం. ఎందుకంటే ఇవాళ్టి ట్రెండ్ లో ప్రేక్షకులు స్క్రీన్ మీద కొత్త ప్రపంచాన్ని, నేపథ్యాన్ని చూసేందుకు ఇష్టపడుతున్నారు. అలాంటి మూవీస్ కు ఆదరణ దక్కుతోంది. ఫిలింమేకర్స్ కు ఏదైనా న్యూ అటెంప్ట్ చేసేందుకు ఇదే రైట్ టైమ్. నేను ‘కంగువ’ రూపొందించడంలో ఈ అంశమే ప్రోత్సాహాన్నిచ్చింది.

– ఎంత పెద్ద కథైనా రాసుకోవడం సులువు. కానీ తెరకెక్కించడం కష్టం. మేము నాచురల్ లొకేషన్స్ కు వెళ్లి అక్కడ సెట్స్ వేసి సినిమా చేశాం. ఒక సముద్రంలో 400 షిప్స్ వెళ్తాయి అని స్క్రిప్ట్ లో రాసుకోవచ్చు కానీ దాన్ని తెరకెక్కించాలంటే టెక్నికల్ గా ఎంతో స్ట్రాంగ్ గా ఉండాలి. నా టీమ్ నాకు అలాంటి సపోర్ట్ ఇచ్చింది. అందుకే టైటిల్ క్రెడిట్స్ లో శివ అండ్ టీమ్ అని వేశాను.

– దేవిశ్రీ ప్రసాద్ ఒక పవర్ హౌస్. అతనితో గతంలో వీరం అనే మూవీ చేశాను. ‘కంగువ’కు గొప్ప సౌండింగ్ ఇచ్చారు దేవి. మూవీ కోసం ఎంతైనా శ్రమిద్దాం అని దేవి నాతో చెప్పేవారు. ఆయన ఇచ్చిన సాంగ్స్, బీజీఎం ఈ మూవీకి ఎంతో ఆకర్షణ తీసుకొచ్చాయి. సినిమాటోగ్రాఫర్ వెట్రి నాతో చాలా కాలంగా ట్రావెల్ చేస్తున్నారు. ఈ మూవీకి అద్బుతమైన విజువల్స్ ఇచ్చారు.

– రెండు టైమ్ ఫ్రేమ్స్ లో సాగే చిత్రమిది. కంగువ వెయ్యేళ్ల కిందటి వీరుడు. అతను ఇచ్చిన మాట ఏంటి, మాట ఇస్తే నిలబెట్టుకునేందుకు ఎంతటి సాహసం చేశాడు అనేది ఆసక్తికరంగా ఉంటుంది. మరోవైపు ఇప్పటికాలంలో ఫ్రాన్సిస్ క్యారెక్టర్ చూపిస్తున్నాం. కంగువకు జోడీ ఉండదు. కంగువ సీక్వెల్ లో ఉంటుంది. ఫ్రాన్సిస్ కు దిశా జోడీగా కనిపిస్తుంది.

– నాకు ఒక ప్రేక్షకుడిగా కమర్షియల్ సినిమా చూడటం ఇష్టం. దర్శకుడిగా కమర్షియల్ సినిమాలు చేయడం ఇష్టం. కంగువ క్రియేటివ్ గా, కమర్షియల్ గా పర్పెక్ట్ బ్లెండింగ్ లో ఉంటుంది.

– ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ గారు ముందు నుంచీ ‘కంగువ’ ప్రాజెక్ట్ మీద చాలా నమ్మకంతో ఉన్నారు. కొంత షూట్ అయ్యాక రషెస్ చూపించాం. అది చూసి మీకు నచ్చినట్లు మూవీ చేయండి, ఎక్కడా కాంప్రమైజ్ కావొద్దని అన్నారు. అందుకు జ్ఞానవేల్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ప్రొడక్షన్ లో ప్రెస్టీజియస్ బ్యానర్ యూవీ క్రియేషన్స్ భాగమవడం సంతోషంగా ఉంది. జ్ఞానవేల్ గారికి యూవీ సంస్థతో మంచి అనుబంధం ఉంది.

– కంగువ సినిమాలో ఒక సర్ ప్రైజింగ్ అతిథి పాత్ర ఉంటుంది. అది కంగువ సీక్వెల్ కు లీడ్ ఇస్తుంది. ఆ క్యారెక్టర్ ఎవరు చేశారనేది మీరు స్క్రీన్ మీద చూడాలి. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతి స్టార్ హీరోతో సినిమా చేయాలని ఉంది. నా దగ్గర ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్స్ ఉన్నాయి. అవకాశం వస్తే తప్పకుండా తెలుగు స్టార్స్ తో సినిమాలు చేస్తాను.

Latest Articles

రేవంత్‌రెడ్డి ఓ భూ కబ్జాదారు – హరీష్‌రావు

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు మాజీ మంత్రి హరీష్‌రావు. రేవంత్‌ ఓ భూ కబ్జాదారుడని ఆరోపించారు. సంగారెడ్డిలో పర్యటించిన హరీష్‌రావు... ప్రశ్నించే గొంతులపై బ్లాక్‌మెయిల్‌ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. తనపైనా అలాంటి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్