వైసీపీ ప్రభుత్వంపై సినీ నటుడు నారా రోహిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రావణాసురుడిని చంపడానికి రాముడు, లక్ష్మ ణుడు, వానర సైన్యం కలిసి పోరాటం చేశారని, అదే రీతిలో ఏపీలో రాక్షస పాలన అంతమొందించడానికి టీడీపీ, బీజేపీ, జనసేనలు కలిసి పని చేస్తున్నాయన్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో యువత భవిష్యత్ నాశనం అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తణుకులో ఆరిమిల్లి ఆధ్వర్యంలో జరి గిన తెలుగు యువత ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు.


