కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు(Kiren rijiju)కు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. జమ్ముకశ్మీర్ పర్యటనలో ఉన్న ఆయన కారును ఓ ట్రక్కు బలంగా ఢీకొట్టింది. అయితే అదృష్టవశాత్తూ కిరణ్ కు ఎలాంటి గాయాలు కాలేదు. ఉదంపూర్ సమీపంలో లోడుతో వెళ్తున్న ట్రక్కు ఆయన కారును ఢీ కొట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది కారు వద్దకు చేరుకుని ఆయనను కారులో నుంచి బయటకు తీశారు. ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ట్రక్కు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రమాదం గురించి ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
This was scary… Good to know @KirenRijiju is safe. Serious concerns over his Security arrangments, how could Pilot car not stop the truckpic.twitter.com/1hyPJBPcCJ
— Mihir Jha (@MihirkJha) April 8, 2023