స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణాలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వాన బీభత్సం సృష్టించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. ఖమ్మంలో మోస్తరు వర్షం కురిసింది. కొమురంభీం జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ లో కూడా పలుచోట్ల వర్షాలు కురిశాయి. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం సంగారెడ్డి జిల్లాలో నమోదు అయింది. నాగల్ గిద్దలో అత్యధికంగా 62 మి.మీ వర్షపాతం నమోదు అయింది. మెదక్ జిల్లా రేగోడ్ లో 23 మి.మీ వర్షపాతం.. సిద్దిపేట జిల్లా వర్గల్ ల్ 15 మి.మీ వర్షపాతం నమోదు అయింది.