22.7 C
Hyderabad
Friday, October 24, 2025
spot_img

తెలంగాణ వ్యాప్తంగా అకాల వానలు

    ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతుకు అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తడిసిన ధాన్యం ఓ పక్క కాంటాలు ఆలస్యం మరోపక్క లంచాలు ఇస్తేనే ధాన్యాన్ని తరలిస్తామని చెబుతున్న నిర్వాహకులు అందరూ అన్నదాతను ఆగం చేస్తున్నారు.

   పండించిన పంట నేల పాలైంది. ఆకాల వర్షం కురవడంతో రైతన్నలకి ఆపార నష్టం వాటిల్లింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో నిన్న వర్షం దంచికొట్టింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షానికి వరిధాన్యం తడిసి ముద్దయింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. 15 రోజులుగా ధాన్యం ఎండకు ఎండుతూ ఇబ్బందులు పడాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా ఇదే దుస్థితి అని రైతులు వాపోతున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగనియ్యమని చెబుతున్న అధికారులు.. ఇప్పటికైనా తమ గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

    జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో రాత్రి కురిసిన అకాల వర్షానికి కల్లాల్లోని వరి ధాన్యం తడిసి ముద్దయింది. గత కొద్ది రోజులుగా వర్షాలు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్న కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో నిన్న కురిసిన వర్షానికి ధాన్యం తడిసి ముద్దయ్యాయని … భారీగా నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. .తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

  వరంగల్ జిల్లా వర్ధన్పేటలో కురిసిన అకాల వర్షానికి అన్నదాతల వరి ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి. ఇల్లంద వ్యవసాయ మార్కెట్ యార్డులో ఐకెపి ఆధ్వర్యంలో చేపట్టిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాత్రి కురిసిన వర్షానికి తడిసి ముద్దవగా.. వాటి నిర్వహణ పట్ల ఐకెపి సంఘాల బాధ్యులు పట్టించుకోకుండా వదిలేశారు. దీనికి తోడు గత కొన్ని రోజులుగా కాంటాలు వేస్తున్న హమాలీలు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. లంచాలు ఇచ్చిన వారికే ముందుగా కాంటాలు పెట్టి బస్తాలను మిల్లులకు తరలిస్తున్నారు. ఇక వర్ధన్నపేట పట్టణంలో హమాలీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. హమాలీల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాత్రి కురిసిన వర్షాలతో తడిసిపోవడం ఉదయం ఆరబెట్టడం అన్నదాతలకు దినచర్యగా మారింది. అకాల వర్షం కారణంగా పంట నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు.

   కామారెడ్డి జిల్లాలో నిన్న వర్షం దంచికొట్టింది. బిక్కనూర్, బీబీపేట, దోమకొండ మండలాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కురవడంతో వరి కొనుగోలు కేంద్రాల వద్ద వరి ధాన్యం తడిసి ముద్దయింది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి కొనుగోలు కేంద్రంలో ఆరబెట్టిన వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. దీంతో రైతులు కన్నీరు మున్నీరుయ్యారు. అకాల వర్షం కురవడంతో రైతన్నలు ఆగమయ్యారు. భారీ వర్షం కురవడంతో వర్షపు నీటిలో వరి ధాన్యం కొట్టుకుపోవడంతో రైతులు కన్నీరు మున్నీరయ్యారు. వరి ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని రైతులు వేడుకున్నప్పటికి, కోనుగోలులో మాత్రం జాప్యం జరుగుతుందని తెలిపారు.

     పెద్దపల్లి జిల్లాలో భారీ వర్షం కురిసింది. మంథనిలో మండలంలోని ఆరెంద, మల్లారం, వెంకటాపూర్ రైతుల భూములు అన్నారం బ్యాక్ వాటర్‌లో పోతున్నాయి. వర్షాలకు వరిధాన్యం తడిసిముద్దయింది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కనీసం పట్టించుకునే నాథులే కరువయ్యారు. ప్రభుత్వం ఆదేశించిన అధికార యంత్రాంగం నిమ్మకునీరేత్తడం లేదు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.

   మహబూబాబాద్‌ జిల్లాలో నిన్న కురిసిన వర్షానికి వాగులు, వంకలు నిండిపోయాయి. భారీ వర్షానికి జిల్లాలోని పలు వాగులు వంకలు వరదనీరు చేరడంతో జలకళను సంతరించుకున్నాయి. పాకాలఏరు పరివాహక గ్రామాలైన రామవరం, మద్దిమంచ గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాల ప్రజలు అప్రమత్తం గా ఉండాలని అధికారులు కోరుతున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్