స్వతంత్ర వెబ్ డెస్క్: ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, నేటికి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో తెలంగాణలో రాబోయే 3 రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే శనివారం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.