ఓట్ల లెక్కింపు సందర్భంగా మంగళవారం అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా కడపజిల్లా పులివెందులలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, అత్యవసరమై తే తప్ప ఎవరూ బయటకు రావద్దని పులివెందుల డీఎస్పీ వినోద్‌కుమార్ సూచించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని, ప్రజలంతా పోలీసులకు సహకరించాలని చెప్పారు. బయటి వ్యక్తులు పులివెందులకు రాకుండా రింగ్‌రోడ్ చుట్టూ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. అన్ని పార్టీల ఆఫీసుల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు.


