తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పోలీసులు, ఎన్నికల అధికారులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. అక్రమంగా తరలిస్తున్న డబ్బు, బంగారం, మద్యంపై ప్రత్యేక నిఘా పెట్టారు. తాజాగా హైదరాబాద్ లో మాదాపూర్ పోలీసులు, సైబరాబాద్ SOT పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భారీగా బంగారం, వెండి పట్టుబడింది. సరైన పత్రాలు లేకుండా రెండు వాహనాల్లో తరలిస్తున్న 34.78 కిలోల బంగారం, 43.60 కిలోల వెండిని సీజ్ చేశారు. ముంబై నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడిన బంగారం, వెండి 23 కోట్ల విలువ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఎన్నికల తనిఖీల్లో భారీగా పట్టుబడిన బంగారం, వెండి
0
298
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


