- సింహం సింగిల్ గానే వస్తోందంటూ కుండ బద్దలు కొట్టిన సీఎం జగన్
- తెలుగుదేశం, జనసేన కలిసి వస్తున్నాయంటూ విమర్శలు
- ఇప్పటికే ఎన్నికల మూడ్ లోకి వచ్చేసిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. సింహం సింగిల్ గానే వస్తోందంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కుండ బద్దలు కొట్టేశారు. ప్రధాన ప్రతిపక్షాలు తెలుగుదేశం, జనసేన కలిసి వస్తున్నాయంటూ నిష్టూరాలు పలికారు. మొత్తం మీద ఏపీ రాజకీయ ముఖచిత్రం.. ఏపీ సీఎం భాష లో చెప్పాలంటే… వైసీపీ వెర్సస్ టీడీపీ జనసేన అనే అనుకోవాలి. అటువంటప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల మనస్సుని గెలుచుకొనేది ఎవరు.. ఎవరికి ప్రజలు పట్టం కడతారు.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత సింహం సింహాసనం ఎవరికి దక్కబోతోంది అన్నది ఆసక్తి దాయకం.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇప్పటికే ఎన్నికల మూడ్ లోకి వచ్చేసినట్లు కనిపిస్తోంది. సామాన్యుల పక్షాన తాము నిలిచి ఉన్నామని, అందుకే ఆశీర్వదించాలని కోరుతున్నామని పదే పదే చెబుతున్నారు. రాబోయే ఎన్నికలు రెండు క్లాస్ ల మధ్య జరిగే ఎన్నికలు అంటూ ప్రజలకు గుర్తు చేస్తున్నారు. మరి ఇదే అజెండా ను ప్రజలంతా అంగీకరిస్తారా…. దీనికి ప్రతిపక్షాల దగ్గర ఉన్న జవాబు ఏమిటి.. ప్రభుత్వం అనుసరిస్తున్న బటన్ నొక్కే వ్యూహం ఉపకరిస్తుందో, బెడిసికొడుతుందో వచ్చే ఎన్నికల్లో తేలనుంది.