తెలంగాణ అసెంబ్లీ రెండో రోజు హాట్ హాట్‌గా కొనసాగుతుంది. ఆర్టీసీ బకాయిలపై వాడీవేడి చర్చ కొనసాగుతుంది. ఆర్టీసీ సమస్యలను పరిష్కరిస్తామన్నారు… ఎప్పుడు పరిష్కరిస్తారని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా ఎప్పుడు ప్రకటిస్తారని నిలదీశారు. తమ ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులకు 44శాతం పిట్‌మెంట్ ఇచ్చామని…మహాలక్ష్మి పథకానికి సంబంధించి నిధులు ఎప్పుడు విడుదల చేస్తారని అన్నారు. ఆర్టీసీ యూనియన్లను ఎప్పటి నుంచి పునరుద్దరిస్తారని ప్రశ్నించారు హరీశ్‌రావు.


