స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: గుజరాత్ హైకోర్టులో నేడు రాహుల్ గాంధీ పరువునష్టం కేసుపై విచారణ జరుగనుంది. గత శనివారం రాహుల్ పిటిషన్ పై లాయర్ అభిషేక్ సింఘ్వీ సుదీర్ఘ వాదనలు వినిపించారు. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు పై స్టే విధించాలని తన వాదనలో పేర్కొన్నారు. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని పూర్ణేష్ మోడీని హైకోర్టు ఆదేశించినసంగతి తెలిసిందే. కాగా, నేడు జరుగనున్న వాదనలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.