Viveka Murder Case | మాజీమంత్రి వివేకా హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు సీబీఐ అధికారులు. మరో వైపు ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు హై కోర్ట్ లో విచారణ జరుగనుంది. మధ్యాహ్నం 3:30 కు హై కోర్టులో వాదనలు కొనసాగనున్నాయి. గురువారం విచారణ సందర్భంగా వాడివేడి వాదనలు జరిగాయి. దస్తగిరి ముందస్తు బెయిల్ ను సీబీఐ వ్యతిరేకించకపోవడం న్యాయసమ్మతం కాదని అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాది వాదించారు. అవినాష్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని సీబీఐ దర్యాప్తు సాగుతోందన్నారు.