అనారోగ్యం వస్తే టాబ్లెట్ లు వాడాలని పరాయి సంస్కృతి చెబితే.. కేవలం ఆహార నియమాలను చక్కదిద్దుకోవడం ద్వారా అనారోగ్యాన్ని బాగు చేసుకోవచ్చు అని చెప్పేది మన సంస్కృతి. అంత గొప్ప సంస్కృతి కలిగిన దేశం మన దేశం.. జీవనోపాధికి కావలసిన ఆహారాలు, ఔషదాలు ఇచ్చింది. మన పూర్వికులు ఎలాంటి అనారోగ్యం దరిచేరకుండా ఒక గొప్ప దివ్యఔషదాన్ని మనకు అందించారు. అదే చద్దన్నం. ఇందులో ఏముంది? ఇది ఎలా ఔషధం అవుతుంది అనేగా మీ డౌట్.. దీనిగురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.
ప్రపంచంలో ఏ జీవి అయినా.. అది చిన్నది అవ్వచ్చు.. పెద్దది అవ్వచ్చు. దానికి రక్షణకు ఏదో ఒకటి ఇస్తాడు దేవుడు. అలాగే మనుషులలో కూడా.. ధనికుడైన, నిరుపేదైనా అనారోగ్యం దరిచేరితే.. ఖర్చులేకుండా, ఎలాంటి బెంగా పడకుండా తగ్గించుకునే మార్గాలు చాలా ఉన్నాయి. పండ్లు, ఆకు కూరలు తినడం, కొన్ని మొక్కలనుండి రసం తీసి.. తాగించడం, లేదా కట్టుగా వేయడంతో ఇలా చాలానే ఉన్నాయి. అలంటి కోవకు చెందిందే ఈ చద్దన్నం.
రాత్రి మిగిలినా అన్నాన్ని ఉల్లిపాయతో కలిపి పెరుగు లేదా నీళ్లలో నానబెట్టేవారు. దేనికి పొద్దున్నే చక్కగా తినేవారు. పూర్వకాలం పేదవాని ఇంట్లో ఇప్పటి టిఫిన్స్ ఇడ్లీ, దోష, బోండా, వడ, ఉతప్ప లాంటివి లేవు. పొద్దు పొద్దునే ఇలా చద్దన్నం తినేవారు. ఇది శరీరంలో వేడిని తగ్గించడంతో పాటు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే మన పూర్వీకులు ఎన్నాళ్లయినా సంపూర్ణ ఆరోగ్యంగా జీవించేవారు. అలాగే ఉదయాన్నే చద్దన్నం, పెరుగు కలుపుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో లాభం అంటారు పూర్వికులు.
ఇటీవల ఒక అధ్యయనంలో తేలింది ఏంటంటే… క్యాన్సర్ కణాలను కూడా తొలగించే శక్తి.. ఈ చద్దన్నానికి ఉందట. అప్పటినుండి పాశ్చాత్త దేశం వాళ్ళు కూడా మన దేశపు చద్దన్నాని ఎలా చేయాలో తెలుసుకొని వండుకొని తింటున్నారు. అంతటి ప్రాశస్తం మన చద్దన్నానికి ఉంది. అలాగే రక్తహీనత సమస్యతో బాధపడేవారికి చద్దన్నం బాగా ఉపయోగపడుతుంది. ఉదయాన్నే చద్దన్నంలో పెరుగు కలుపుకొని తింటే రక్తం బాగా వృద్ధి చెందుతుంది. తద్వారా ఎప్పుడూ శక్తివంతంగా ఉంటారు.
చద్దన్నం తినేవారి ఒంటికి కాల్షియం చాల బాగా అందుతుంది. దీంతో దంతాలు, ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఎండాకాలం వచ్చే వడదెబ్బ నుండి రక్షణ కల్పిస్తుంది. ఎండలకు సత్తువ కోల్పోయిన వారికి ఉండే నీరసాన్ని కూడా చద్దన్నం నివారిస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుత పాత్ర పోషిస్తుంది. అల్సర్లు, మలబద్ధకం, పేగు సంబంధ సమస్యలు ఉన్నవారికి చద్దన్నం పరమౌషధంలా పనిచేస్తుంది. చద్దన్నంలో ఉండే బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపర్చి.. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతుంది.