స్వతంత్ర వెబ్ డెస్క్: బీఆర్‌ఎస్(BRS) నుంచి టికెట్ వచ్చినప్పటికీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు(MynampallyHanumanthRao) మనసు మార్చుకున్నట్లు కనిపించడం లేదు. మైనంపల్లి ఆయనతో పాటు కొడుకుకు కూడా బీఆర్‌ఎస్ టికెట్ ఆశించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నా మాటకి కట్టుబడి ఉన్నాను.. మాట తప్పను.. మెదక్‌లో నా కొడుకు కచ్చితంగా పోటీ చేస్తాడు. నేను ఏమి చెయ్యబోయ్యేది మెదక్, మల్కాజిగిరి ప్రజలతో చర్చించి త్వరలోనే నా నిర్ణయాన్ని ప్రకటిస్తా. పోటీ నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు.
స్వామి సన్నిధిలో నా వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పాను. కుంభకోణంకీ వెళ్ళి వచ్చి..రెండు రోజుల్లో నా నిర్ణయాన్ని ప్రకటిస్తా. నా కొడుకు నాకు ముఖ్యం.. కొంత కాలంగా ప్రజా సేవ చేస్తున్నాడు. నా అవసరం ఎక్కడ ఉందో.. నేను అక్కడ వుంటాను. కార్యకర్తల నిర్ణయమే నా నిర్ణయం. నేను ఇప్పటి వరకు ఏ పార్టీతో మాట్లాడలేదు. మెదక్ సీట్ నా కొడుకు ఇస్తే. బీఆర్ఎస్ తరుపున ఇద్దరం కలిసి పోటీ చేస్తాం. ప్రజల అభిప్రాయాన్ని తీసుకొని రెండు రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తా’’ అంటూ మైనంపల్లి హనుమంతరావు స్పష్టం చేశారు. తిరుమల నుంచి హైదరాబాద్ వస్తున్నట్లు తెలిపిన ఆయన మల్కాజిగిరి టికెట్ వచ్చినప్పటికీ ఇంకా తిరుమలలోనే ఉండిపోయారు. తన కొడుకు పోటీపై నిర్ణయం రోహిత్‌కే (Rohit) వదిలేశానని నిన్న ప్రకటించిన మైనంపల్లి మళ్లీ యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది.