కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను భయపెట్టి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తుందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. మహిపాల్ రెడ్డి ఇంట్లో ఎలాంటి అవినీతి, అక్రమాస్తులు దొరకలేదని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈడీ, సీబీఐ కేసులతో ప్రతిపక్ష నేతలను భయభ్రాంతులకు గురి చేస్తు న్నారని అన్నారు. పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాల నేపథ్యంలో సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇంటికి మాజీ మంత్రి హరీశ్ రావు వచ్చారు. ఈడీ సోదాలకు సంబంధించిన వివరాలను మధుసూదన్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు.అక్రమాస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో నిన్న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. పలు కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు. మహిపాల్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, ఆఫీసులు, ఇళ్లోనూ తనిఖీలు జరిగాయి. తెల్లవా రుజామున 4 గంటల నుంచి మొత్తం మూడు చోట్ల రెయిడ్స్ కొనసాగాయి. ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధు ఇంట్లో సోదాలు చేసింది ఈడీ. మహిపాల్ రెడ్డి వ్యాపార లావాదేవీలు, అకౌంట్స్, మనీ ట్రాన్సాక్షన్స్ పై ఆరా తీశారు అధికారులు.