ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో జరిగిన ఘోర ప్రమాదంపై మంత్రి హరీష్ రావు(Harish Rao) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు కార్యకర్తలు మృతి చెందడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
ఘటన గురించి తెలియగానే స్థానిక నేతలను ఆరా తీసిన మంత్రి హరీష్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రభుత్వాస్పత్రి సూపరింటెండ్ తో మాట్లాడిన ఆయన క్షతగాత్రులను అవసరమైతే నిమ్స్ ఆసుపత్రికి తరలించాలని సూచించారు.
Read Also: ఖమ్మం ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి.. బాధితులకు హామీ
Follow us on: Youtube, Koo, Google News