28.7 C
Hyderabad
Thursday, May 30, 2024
spot_img

#HBDVijayDevarakonda: జీరో నుంచి హీరోగా మారిన విజయ్ దేవరకొండ

ఒకప్పుడు తన సినిమాను రిలీజ్ చేసేందుకు సపోర్ట్ కోసం వెతుకుతూ ఇబ్బందులు పడిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ..ఇవాళ తన సినిమాలను గ్రాండ్‌గా పాన్ ఇండియా రిలీజ్‌కు తీసుకొస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ ప్రేక్షకుల్ని మెప్పిస్తూ వారి అభిమానం పొందుతున్నాడు. విజయ్ సాగిస్తున్న ఈ జర్నీ యంగ్ టాలెంట్‌ను ఇన్స్ పైర్ చేస్తోంది. ఇండస్ట్రీలోకి రావాలనుకున్న కొత్త వాళ్లు తమకూ విజయ్ దేవరకొండ లాంటి ఒక మంచి కెరీర్ ఉంటుందనే హోప్స్ పెట్టుకుంటున్నారు. తన సక్సెస్‌తో చాలా మందికి రోల్ మోడల్ అయ్యాడు విజయ్. ఇవాళ విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా ఆయన జర్నీని చూద్దాం..

ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా చూస్తున్నవాళ్లకు విజయ్ దేవరకొండ ఎవరో తెలియదు. రిషి క్యారెక్టర్‌లో ఎంతో సహజంగా, ఈజ్‌తో నటిస్తున్న అతన్ని చూసి ప్రేక్షకులు ఇంప్రెస్ అయ్యారు. ఈ కొత్త అబ్బాయి బాగా పర్ ఫార్మ్ చేస్తున్నాడని అనుకున్నారు. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా విజయ్ దేవరకొండ ప్రతిభ అందరికీ తెలిసింది. బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించిన ఈ సినిమా నేషనల్ అవార్డ్ పొందింది. ఇక అర్జున్ రెడ్డి సినిమా విజయ్ కెరీర్‌కు ఒక బెంచ్ మార్క్ మూవీ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్‌లో విజయ్ కాన్ఫిడెన్స్ చూసి ఇండస్ట్రీ సర్ ప్రైజ్ అయ్యింది. అర్జున్ రెడ్డి క్రియేట్ చేసిన సెన్సేషన్, ఆ సినిమాలో డాక్టర్ అర్జున్‌గా విజయ్ పర్ ఫార్మెన్స్ చూసి బీ, సీ సెంటర్స్ ఆడియెన్స్ నుంచి సెలబ్రిటీల దాకా విజయ్ ఫ్యాన్స్ అయ్యారు. ఈ సినిమా మిస్ అయినందుకు స్టార్ హీరోలు, ఇలాంటి సినిమా తామెందుకు చేయలేదని డైరెక్టర్స్ ఫీలయ్యారు. విజయ్‌ను అప్రిషియేట్ చేశారు.

టాక్సీవాలా విజయ్‌కు మరో సూపర్ హిట్ ఇస్తే.. గీత గోవిందం ఆయన కెరీర్‌లో ఫస్ట్ హండ్రెడ్ క్రోర్ మూవీగా నిలిచింది. హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన గీత గోవిందం విజయ్ కెరీర్‌లో మరో స్పెషల్ మూవీగా నిలిచింది. ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు విజయ్ దేవరకొండను సకుటుంబ ప్రేక్షకుల దగ్గరకు మరింతగా చేర్చాయి. సినిమా మీద ప్యాషన్, నటన మీద ప్రేమ, హీరోగా విజయ్ చూపించే డెడికేషన్ అందరినీ ఆకట్టుకుంటుంది. స్టార్‌గా ఎదగడమే కాదు సొసైటీ పట్ల తన బాధ్యతను ఎప్పుడూ మర్చిపోలేదు విజయ్ దేవరకొండ. కరోనా టైమ్‌లో దేవరకొండ ఫౌండేషన్ ద్వారా మిడిల్ క్లాస్ ఫండ్ ఏర్పాటు చేసి, పేద మధ్య తరగతి కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, ఇతర సహాయం అందించాడు. యువతకు ఉపాధి కోసం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేశాడు. దేవరశాంట పేరుతో ఏటా తన ఫ్యాన్స్ లో కొందరిని టూర్స్ పంపిస్తుంటాడు. తన పుట్టిన రోజున నగరంలోని వివిధ ప్రాంతాలలో ఐస్ క్రీం ట్రక్స్ ఏర్పాటు‌ చేయిస్తారు విజయ్. ఖుషి సినిమా టైమ్‌లో ప్రేక్షకుల్లో వందమందిని సెలెక్ట్ చేసి వారి కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున కోటి రూపాయల సాయం అందించాడు. ఇలా మంచి మనసున్న స్టార్ హీరోగా విజయ్ దేవరకొండ పేరు తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన మూడు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న వీడీ 12 సినిమా విశాఖలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సెట్‌లోనే విజయ్ తన బర్త్ డే సెలబ్రేట్ చేసుకోనున్నారు. క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లైనప్ చేసుకుంటున్న విజయ్ దేవరకొండకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం.

Latest Articles

ఇసుక అక్రమ రవాణాపై అనంతపురం కలెక్టర్‌ వార్నింగ్‌

     ఇసుక అక్రమ రవాణాపై అనంతపురం కలెక్టర్ వినోద్‌ కుమార్ వార్నింగ్ ఇచ్చారు. ఎలక్షన్‌ కోడ్‌ అమలులో ఉండటం, పైనుంచి ఆదేశాలు రావడంతో తాడిపత్రి సమీప పెన్నానదిలోని ఇసుక రేవును అధికారులు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్