హన్మకొండ జిల్లా నక్కలగుట్టలోని వైబ్రెంట్ జూనియర్ కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని భవాని కాలేజీలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కూతురు మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. కళాశాల ఫర్నిచర్ ధ్వంసం చేశారు. విద్యార్థి ఆరోగ్యం బాగలేకుంటే కనీస సమాచారం ఇవ్వరా అంటూ నిలదీశారు. మరోవైపు కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.