స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: థాయిలాండ్‌లో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తుండగా పోలీసులకు పట్టుబడిన క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ ముఠాకు బెయిల్ లభించింది. పటాయలోని ఓ హోటల్ లో భారీ ఎత్తున గ్యాంబ్లింగ్ నిర్వహిస్తుండగా ప్రవీణ్ తో పాటు 83 మంది భారతీయులను సోమవారం పోలీసులు పట్టుకున్నారు. నిందితులను ఇవాళ థాయ్ కోర్టులో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ప్రవేశపెట్టగా అందరికీ షరతులతో కూడిన బెయిల్‌ను న్యాయస్థానం మంజూరు చేసింది. జరిమానాగా రూ.4,500 రూపాయిలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. జరిమానా చెల్లించేంత వరకు నిందితుల పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకోవాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. అయితే వెంటనే ఫైన్ చెల్లించడంతో పాస్‌పోర్టులను తిరిగిచ్చేశారు. దీంతో చికోటి ప్రవీణ్ గ్యాంగ్ థాయిలాండ్ నుంచి ఇండియాకు రానున్నట్లు సమాచారం


