AP Group 1 |ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్- APPSC గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్ 23వ తేదీ నుంచి 29వరకు ఈ పరీక్షలు జరగాల్సి ఉండగా జూన్ తొలి వారానికి వాయిదా పడ్డాయి. ఏప్రిల్ 24వ తేదీ నుంచి మే 18వరకు సివిల్స్ ఇంటర్వ్యూలు ఉండటంతో ఈ పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించినట్టు APPSC అధికారులు వెల్లడించారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను జూన్ 3 నుంచి 9వరకు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. ఈనెల 27వ తేదీన యూపీఎస్సీ సివిల్స్ ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఏపీపీఎస్సీ తాజా నిర్ణయం తీసుకుంది. సివిల్స్ ఇంటర్వ్యూలకు ఆంధ్రప్రదేశ్ నుంచి గ్రూప్ 1 పరీక్ష రాసే 25మంది అభ్యర్థులు హాజరు కావాల్సిఉంది. వారిని దృష్టిలో ఉంచుకొని అధికారులు AP Group 1 మెయిన్స్ పరీక్షల తేదీల్లో మార్పులు చేశారు. మరోవైపు ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్స్ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. పేపర్ లీకేజీ నేపథ్యంలో టిఎస్పిఎస్సి పరీక్షలను రద్దు చేసింది.
Read Also: నేడు ఢిల్లీకి సీఎం జగన్.. ఆ కేంద్రమంత్రితో ప్రత్యేక సమావేశం..
Follow us on: Youtube, Instagram, Google News