ఎన్నికల కోడ్ కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్‌లో మూడు నెలలుగా నిలిచిపోయిన గ్రీవెన్స్‌డే జరిగింది. కొత్తగూడెం కలెక్టరేట్‌కు జిల్లా నలుమూలల నుండి భారీగా జనం తరలివచ్చారు. సుదీర్ఘకాలం పాటు గ్రీవెన్స్ డే లేకపోవటంతో సమస్యల వినతిపత్రాలతో సామాన్యులు పోటెత్తారు. కలెక్టర్ ప్రియాంకా అలా ఇతర ఉన్నతాధికారులతో కలిసి స్వయంగా ఫిర్యాదులు స్వీకరించారు. గ్రీవెన్స్ డేలో వ్యక్తిగత సమస్యలు, ఊరి సమస్యలపై ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులను పరిశీలించి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఇక నుండి ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే కొనసాగు తుందని అధికారులు పేర్కొన్నారు.


