19.2 C
Hyderabad
Saturday, January 17, 2026
spot_img

ఏపీలో తగ్గుతున్న వైసీపీ గ్రాఫ్

     2019 నుంచి అప్రతిహతంగా సాగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ రోజు రోజుకి తగ్గిపోతుందా? వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసీపీకి అధికారం దక్కే అవకాశం లేదా? టిడిపి- జనసేన కూటమి గద్దెనెక్కే ఛాన్స్ ఉందా? అందుకే వైసీపీ నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారా? సీఎం జగన్ ఒంటెత్తు పోకడలు…. ఏకపక్ష నిర్ణయాలు…. జగన్ పై ఆ పార్టీ నేతలకు నమ్మకం సన్నగిల్లడానికి కారణమా ? …. అంటే అవుననే అంటున్నాయి అధికార పార్టీ వర్గాలు.

      ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు అధికార వైసిపి తో పాటు టిడిపి- జనసేన కూటమి సిద్ధమవుతోంది. అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని “సిద్ధం” పేరుతో భారీ బహిరంగ సభలు కూడా నిర్వహి స్తోంది. “సిద్ధం” సభలకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు వైసీపీ నేతలు. ఇప్పటికే మూడు ప్రాంతాల్లో ఈ సిద్ధం సభలు నిర్వహించారు. సిద్ధం సభలకు వస్తున్న జనాన్ని చూసిన తర్వాత వచ్చే ఎన్ని కల్లో అధికారం తమదే అని వైసిపి అధినేత జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ పార్టీ నేతలు మాత్రం జగన్మోహన్ రెడ్డి పైన, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకాన్ని కోల్పోతున్నారు.

     ఏపీలో మళ్లీ అధికారంలోకి వచ్చేది తామే అని జగన్ చెప్తున్నా సొంత పార్టీ నేతలు మాత్రం వైసిపికి గుడ్ బై అంటు న్నారు. తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనా మా చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి గుమ్మనూరు జయరాం సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఎంపీలు బాలశౌరి, సంజీవ్ కుమార్, లావు శ్రీకృష్ణదేవరాయలు వైసిపినీ వీడి తెలుగుదేశం, జనసేన పార్టీలో చేరుతున్నారు. మరోవైపు అధికార వైసీపీకి చెందిన కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా వైసిపి కి గుడ్ బై చెప్పి, టిడిపి తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారం మనదే అని జగన్ చెప్తున్నా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వైసీపీని వీడి టిడిపి- జనసేన లో చేరడానికి కారణం ఏంటనేది అధికార పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

     2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. 151 మంది ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలను గెలుచుకొని తిరుగులేని అధికారాన్ని దక్కించుకుంది. అయితే ఈ ఐదేళ్ల జగన్ పాలనలో అంతకుమించి ప్రభుత్వం వ్యతిరేకతను మూట కట్టుకుందనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రానికి రాజధాని లేకపోవడం, అభివృద్ధి నిలిచిపోవడం వంటి అంశాలు విద్యావం తులలోనూ, మేథావుల్లోనూ వైసీపీపై తీవ్ర అసంతృప్తి కలిగిస్తున్నాయి. అదే సమయంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో యువత సైతం వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. తాము అధికారం లోకి వస్తే మెగా డీఎస్సీ వేస్తామన్న వైసిపి చివరకు ఎన్నికలు రెండు నెలలు ఉందనగా.. కేవలం ఆరువేల పోస్టులతో డీఎస్సీ ప్రకటించింది. ఈ ప్రకటన పై యువత నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మరోవైపు రైతుల పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం, రైతు భరోసా పేరిట ఇస్తున్న నిధులు బ్యాంకు వడ్డీలకు కూడా సరిపోక పోవడంతో రైతాంగం సైతం వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంగా ఉంది.

      రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పెరిగిన నిత్యవసర ధరలు, పన్నులు, పెరిగిన కరెంట్ బిల్లులు, పెట్రోల్ డీజిల్ ధరల వంటి విషయాల్లోనూ సామాన్య, మధ్యతరగతి ప్రజానీకం సైతం ఆసంతృప్తిగా ఉంది. ఈ పరిణామాల నేపథ్యం లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫు రోజుకి తగ్గిపోతుందనే వాదన పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తామన్న చాలామంది నేతలు వైసీపీలో తమకు టికెట్లు వద్దంటూ టిడిపి- జనసేన పార్టీలో చేరుతున్నారు. ఆయా పార్టీల్లో టిక్కెట్టు దక్కని వారు మాత్రమే వైసీపీలో కొనసాగుతున్న పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో టిడిపి- జనసేన కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ముఖ్యంగా అభివృద్ధి విషయంలో జగన్ కంటే చంద్రబాబు పనితీరు బాగుంటుందనే అభిప్రాయం తాజాగా వస్తున్న సర్వేల్లో వెల్లడవుతుంది. అదే సమయంలో జనసేన సైతం గతంతో పోలిస్తే భారీగా పుంజుకోవడంతో పలువురు వైసీపీ నేతలు ఆ పార్టీ వైపు కూడా చూస్తున్నారు. రానున్న ఎన్నికల్లో మళ్ళీ వైసిపి అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోగా టిడిపి- జనసేన కూటమి అధికారం దక్కించుకునే అవకాశం ఉండటంతో ముందుగానే అధికార పార్టీ నేతలు ఆ కూటమిలో తమ సీట్లను కన్ఫామ్ చేసుకుంటున్నారు.

        ఎన్నికల ముందు జగన్ చేపట్టిన మార్పులు, చేర్పులు ప్రయోగం పెద్ద గందరగోళానికి దారితీసింది. మార్పులు చేర్పుల పేరుతో ఎమ్మెల్యేలను ఇష్టానుసారంగా మారుస్తూ, కొత్త అభ్యర్థులను ఎంపిక చేయడంతో వైసీపీ నేతలు అంతర్గతంగా రగిలిపోతున్నారు. మార్పులు, చేర్పుల పేరుతో 30 మందికి కి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను జగన్ పక్కన పెట్టారు. అలాగే మరికొన్ని నియోజకవర్గాలకు పక్క నియోజ కవర్గ నేతలను పంపించారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థు లను మార్చే విషయంలో సరైన కసరత్తు చేయ కుండా సర్వేల పేరుతో మార్చడంపై సొంత పార్టీ నేతల్లోనే తీవ్ర వ్యతిరే కత వ్యక్తం అవుతుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఏకపక్ష ధోరణికి ఇది ఉదాహరణని ఆ పార్టీ నేతలు అభిప్రా యపడుతు న్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ చాలా మంది నాయకులు పార్టీలు మారడంతో కార్యకర్తలు గందరగోళంలో పడిపో యారు. తమ అభిమాన నాయకుల వెంట తామూ పార్టీ మారడమా.. నమ్మిన పార్టీలోనే కొనసాగ డమా అన్న అయోమ యంలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థిని మార్చిన చోట్ల స్థానిక నాయకులు, కార్యకర్తలకు కొత్త నాయకులకూ సమన్వయం కుదరడం లేదు. దీంతో కార్యకర్తల్లో నూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. మొత్తం మీద పార్టీ గ్రాఫ్ పడిపోయిందనే చెప్పాలి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్