18.7 C
Hyderabad
Friday, January 3, 2025
spot_img

ఘనంగా ‘వీక్షణం’ ప్రీరిలీజ్ ఈవెంట్

రామ్ కార్తీక్, క‌శ్వి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “వీక్షణం”. ఈ చిత్రాన్ని ప‌ద్మ‌నాభ సినీ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మిస్తున్నారు. కామెడీ మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు మ‌నోజ్ ప‌ల్లేటి రూపొందిస్తున్నారు. “వీక్షణం” సినిమా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

డీవోపీ సాయిరామ్ మాట్లాడుతూ – వీక్షణం సినిమాకు వర్క్ చేయడం మంచి ఎక్సీపిరియన్స్ ఇచ్చింది. ముందుగా నా డిపార్ట్ మెంట్ లో పనిచేసిన టీమ్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. విజువల్స్ బ్యూటిఫుల్ గా వచ్చేందుకు ప్రతి ఒక్కరు తమ ఎఫర్ట్స్ పెట్టారు. ఈ ఫ్రైడే మా వీక్షణం సినిమా థియేటర్స్ లోకి వస్తోంది. తప్పకుండా చూడండి. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ సమర్థ్ గొల్లపూడి మాట్లాడుతూ – వీక్షణం సినిమా సాంగ్స్ కు మీ దగ్గర నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ పాటలు ఇంత బాగా రావడానికి డైరెక్టర్ మనోజ్ సపోర్ట్ చేశారు. మూవీలో బీజీఎం కూడా ఆకట్టుకునేలా ఉంటుంది. ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అనుభూతిని వీక్షణం అందిస్తుంది. థియేటర్స్ లో మా మూవీ చూసి మీ స్పందన తెలియజేయండి.

నటుడు షైనింగ్ ఫణి మాట్లాడుతూ – వీక్షణం సినిమాలో నేను హీరోకు ఫ్రెండ్ రోల్ లో నటించాను. చాలా మంచి రోల్ తో మీ ముందుకు వస్తుండటం సంతోషంగా ఉంది. మేము ఈ మూవీలో నటిస్తున్నప్పుడు ఒక వెకేషన్ కు వెళ్లిన ఫీల్ కలిగింది. ఎక్కడా మూవీ చేస్తున్నామని అనిపించలేదు. అంత కంఫర్ట్ గా షూటింగ్ చేశారు డైరెక్టర్ మనోజ్ గారు. వీక్షణం మంచి ఎక్సీపిరియన్స్ ఇచ్చే థ్రిల్లర్ మూవీ అవుతుంది. అన్నారు.

నటుడు శ్రీనివాస్ మాట్లాడుతూ – వీక్షణం మూవీలో హీరోతో పాటు నేను, షైనింగ్ ఫణి చేసే హంగామా మిమ్మల్ని ఎంతగానో ఎంటర్ టైన్ చేస్తుంది. హీరో రామ్ కార్తీక్, నేను, ఫణి ఒక మంచి టైమింగ్ లో సీన్స్ చేశాం. మా మూవీ ట్రైలర్ మీకు నచ్చితే తప్పకుండా థియేటర్స్ కు వెళ్లి మూవీ చూడండి. అన్నారు.

నటి బిందు మాట్లాడుతూ – వీక్షణం సినిమా ప్రీ రిలీజ్ కు వచ్చిన మీ అందరికీ థ్యాంక్స్. మా డైరెక్టర్ గారు మా టీమ్ ఒకే మాట చెప్పేవారు. కష్టపడి కాదు ఇష్టపడి పనిచేయండని, అప్పుడే ఔట్ పుట్ బాగా వస్తుందని అనేవారు. ఆయన చెప్పినట్లే మేమంతా టీమ్ వర్క్ చేశాం. వీక్షణం సినిమా చూడండి మిమ్మల్ని నిరాశపర్చదు. అన్నారు.

హీరోయిన్ కశ్వి మాట్లాడుతూ – వీక్షణం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన మీ అందరికీ థ్యాంక్స్. మా మూవీ రిలీజ్ కు వస్తుందంటే ఎగ్జైటింగ్ గా ఉంది. థియేటర్ లో మీరు ఎప్పుడు సినిమా చూస్తారా అని వెయిట్ చేస్తున్నాను. వీక్షణం టీమ్ తో కలిసి వర్క్ చేయడం మంచి ఎక్సీపిరియన్స్ ఇచ్చింది. మా సినిమా చూసేందుకు థియేటర్స్ కు వచ్చేయండి. మీరు తప్పకుండా ఎంటర్ టైన్ అవుతారు. అన్నారు.

దర్శకుడు మనోజ్ పల్లేటి మాట్లాడుతూ – నేను మా టీమ్ వీక్షణం మూవీ గురించి ఎంతైనా చెప్పగలం. ఎవరి బిడ్డ వారికి ముద్దుగానే ఉంటుంది. మా సినిమా బాగుందని మేము చెప్పడం కాదు థియేటర్స్ లో చూసి మీరంతా చెబితే చాలా హ్యాపీగా ఫీలవుతాం. వీక్షణం తప్పకుండా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది. సక్సెస్ మీట్ లో మిమ్మల్ని మళ్లీ కలుస్తాను. మా సినిమాను ఆడియెన్స్ కు రీచ్ చేసేందుకు సురేష్ కొండేటి గారు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నాం. ఫ్రైడే తప్పకుండా థియేటర్స్ కు వెళ్లి వీక్షణం మూవీ చూడండి. అన్నారు.

హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ – వీక్షణం వంటి ఒక బ్యూటిఫుల్ స్క్రిప్ట్ నాకు ఇచ్చిన మా డైరెక్టర్ మనోజ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. మా సినిమా మిస్టరీ థ్రిల్లర్ జానర్ లో సరికొత్తగా ఉంటూ ఆకట్టుకుంటుంది. మనం రకరకాల జానర్ మూవీస్ ఇష్టపడుతుంటాం. కానీ థ్రిల్లర్ మూవీస్ అంటే అందరికీ ఇష్టమే. అలా మీ అందరికీ నచ్చే మంచి థ్రిల్లర్ మూవీ వీక్షణం. ఈ సినిమాకు పనిచేసి ప్రతి డిపార్ట్ మెంట్, ప్రతి టీమ్ మెంబర్ ఎంతో ప్యాషన్ తో వర్క్ చేశారు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్..ఇలా టెక్నికల్ గా మా మూవీ చాలా క్వాలిటీగా ఉంటుంది. ఈ శుక్రవారం వీక్షణం సినిమాతో మీ ముందుకు వస్తున్నాం. థియేటర్స్ లో మా సినిమా చూసి ఎలా ఉందో చెబుతారని కోరుకుంటున్నా. అన్నారు.

న‌టీన‌టులు: రామ్ కార్తీక్, కశ్వి, శ్రీనివాస్, బిందు, షైనింగ్ ఫణి, తదితరులు

సాంకేతిక వ‌ర్గం:
ఆర్ట్ – గాంధీ నడికుడికర్
ఎడిటర్ – జెస్విన్ ప్రభు
సినిమాటోగ్రఫీ – సాయిరామ్ ఉదయ్
మ్యూజిక్ డైరెక్టర్ – సమర్థ్ గొల్లపూడి
బ్యానర్ – పద్మనాభ సినీ ఆర్ట్స్
పీఆర్ఓ – సురేష్ కొండేటి
నిర్మాతలు – పి.పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి
రచన, దర్శకత్వం – మనోజ్ పల్లేటి

Latest Articles

అమరావతిలో రూ.2733 కోట్ల పనులకు కేబినెట్‌ ఆమోదం

ఏపీ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఆర్డీఏ పరిధిలో రూ.2,733 కోట్ల మేర పనులు చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్