19.7 C
Hyderabad
Saturday, February 14, 2026
spot_img

జగన్‌కు ప్రభుత్వం భద్రత కల్పించాల్సిందే

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. తనకు జడ్ ప్లస్‌ కేటగిరీని కుదించడాన్ని సవాలు చేస్తూ జగన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది.

వైఎస్‌ జగన్‌కు మంచి బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం ఎందుకు ఇవ్వడం లేదని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జగన్‌కు మరో బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం కేటాయించాలని సూచించింది. జామర్‌ ఏర్పాటుపై కూడా స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం.. జగన్‌కు జామర్ వెహికల్స్‌ను కూడా కేటాయిస్తామని వివరించింది. మాజీ ముఖ్యమంత్రికి ప్రభుత్వం భద్రత కల్పించాల్సిందేనని స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్