29.2 C
Hyderabad
Sunday, January 5, 2025
spot_img

రైతులను బిచ్చగాళ్ళను చేయాలని ప్రభుత్వం చూస్తోంది – కేటీఆర్‌

రైతు భరోసా ఎగ్గొట్టేందుకే దరఖాస్తులు మళ్లీ అడుగుతున్నారని బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఆరోపించారు. ప్రమాణ పత్రం ఇస్తేనే రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని.. అన్ని వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నా ప్రమాణ పత్రాలు,,. దరఖాస్తులు ఎందుకని ప్రశ్నించారు.

ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టకపోయినా కేసీఆర్ రైతుబంధు పథకం తెచ్చారని గుర్తు చేశారు. వరుసగా 11 సీజన్లకు రైతులకు నేరుగా ఖాతాలోకి రూ 73 వేల కోట్లు వేశారు. 12 వ సీజన్‌కు రైతులకు వేయడానికి బిఆర్ఎస్ ప్రభుత్వం జమ చేసిందని చెప్పారు. ఎన్నికల సంఘానికి రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేసి రైతుబంధు ఆపారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఒక్క రూపాయి రైతుబంధు ఇవ్వలేదని కేటీఆర్‌ మండిపడ్డారు.

వరంగల్ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ బిల్డప్ ఇచ్చిందన్నారు కేటీఆర్‌. ఎన్నికలు అయ్యాక రైతులు ప్రమాణపత్రం ఇవ్వాలని అంటున్నారు… ప్రజా పాలన కింద కోటీ ఆరు లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారని… రైతు భరోసా కోసం ప్రభుత్వం ప్రజాపాలన కింద దరఖాస్తుల్లో తీసుకున్నారని చెప్పారు. రైతులు ప్రమాణపత్రం ఇస్తే రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం అంటుందని. రైతులను బిచ్చగాళ్ళను చేయాలని ప్రభుత్వం చూస్తోందని అన్నారు.

అఫిడవిట్లు తీసుకువెళ్లి దేవుళ్ల దగ్గర కాంగ్రెస్ సన్నాసులు పెట్టారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వానాకాలంలో ఇవ్వాల్సిన రైతుబంధును ఇవ్వలేదని అన్నారు. ప్రమాణపత్రం ఇవ్వాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏ ఊర్లో ఎంతమంది రైతులకు రుణమాఫీ చేశారో దమ్ముంటే లిస్ట్ పెట్టండి. బోనస్ ఏ ఊర్లో ఎంతమందికి ఇచ్చారో లిస్ట్ పెట్టండి. రైతుబంధును బొందపెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోంది. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలని రైతు బంధు బంద్ పెట్టాలని చూస్తున్నారు.

రైతుబంధు రూ22 వేల కోట్లు పక్కదారి పట్టాయని అసత్య ప్రచారం చేస్తున్నారు. రెండవ పంట వేయకపోయినా రైతులకు మేము రైతు బంధు ఇచ్చాము. ప్రమాణపత్రం ఎందుకు… అని రైతులు ప్రభుత్వాన్ని నిలదీయాలి. రైతుబంధు బాకీ పడ్డందుకు ప్రభుత్వంపై ఊరూరా పోస్టర్లు వేస్తాము. 22 వేల కోట్లు ఎక్కడ దుర్వినియోగం అయ్యాయో.. చెప్తారా?

రుణమాఫీపై ప్రభుత్వం గ్రామ పంచాయతీల వారీగా లిస్ట్ పెట్టండి. రైతులను దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు అడుక్కుంటారా అని.. వ్యవసాయ శాఖామంత్రి మాట్లాడుతున్నారు. వరంగల్ డిక్లరేషన్ పై కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ నిలదీద్దాం. క్యాబినెట్ లో రైతు భరోసాపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలి. రైతు భరోసాపై క్యాబినెట్ సబ్ కమిటీ ఏం చేసింది. హార్టీకల్చర్ పంటలకు మేము రెండు విడతలు రైతు బంధు ఇచ్చాము. పీఎం కిసాన్ యోజన అనేది కొంతమంది రైతులకు వస్తుంది… అని కేటీఆర్‌ అన్నారు.

Latest Articles

ప్రజా సమస్యలపై పోరాటానికి బీజేపీ సై

ప్రజా సమస్యలపై పోరాటాలకు కాషాయదళం సై అంటోందా..? ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ నేతలు మరింతగా గళం విప్పనున్నారా ? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంతేకాదు.. త్వరలోనే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్