మహబూబాబాద్ జిల్లా కురవిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వీరభద్రస్వామి సేవలో ప్రముఖ హీరో గోపీచంద్ పాల్గొన్నారు, స్వామికి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న గోపీచంద్‌కు ఆలయ మర్యాదలతో ఆలయం అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం భద్రకాళి అమ్మవారికి, వీరభద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి, అమ్మవారి తీర్థప్రసాదాలను హీరో గోపీచంద్‌కు అందజేశారు. గోపీచంద్‌కు శివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను, ఆలయ కార్యనిర్వహణ అధికారి సత్యనారాయణ అందజేసి, ఆలయ మర్యాదలతో శాలువాలతో సత్కరించారు.