స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ ప్రజలకు శుభవార్త..త్వరలోనే ఆసరా పెన్షన్లు పెరగనున్నాయి. అసరా పెన్షన్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచే అవకాశం ఉంది. త్వరలోనే పెన్షన్లపై సీఎం కేసీఆర్ శుభవార్త చెబుతారని మంత్రి కేటీఆర్ ఓరుగల్లు సభలో నిన్న హింట్ ఇచ్చారు. రెండురోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉండగా… ఈ లోగానే పెన్షన్ల పెంపుపై ప్రభుత్వం ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే దివ్యాంగుల పెన్షన్లను రూ. 4016 కు పెంచగా…. మిగతా ఆసరా పెన్షన్లను కూడా రూ. 1000 పెంచనున్నట్లు సమాచారం. కేసీఆర్ అంటే సంక్షేమం, విపక్షాలది సంక్షోభం అని కామెంట్స్ చేశారు మంత్రి కేటీఆర్. 60 ఏళ్లు అధికారంలో ఉండి అభివృద్ధి చేయని వాళ్లు ఇప్పుడు చేస్తారా..? అని ప్రశ్నించారు. ఒక్కఛాన్స్ ఇవ్వండని మీ దగ్గరకు వస్తారు.. వారిని నమ్మి మోసపోకండి అని పిలుపునిచ్చారు. పొలిటికల్ టూరిస్టులు చెప్పే మాటలను ఎవరూ నమ్మొద్దన్నారు. మోసాన్ని మోసంతోనే జయించాలన్నారు.