స్వతంత్ర వెబ్ డెస్క్: వచ్చే సంక్రాంతి నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఐదు లక్షల పేదల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఆదేశించారు. తాజాగా విజయవాడలోని గృహ నిర్మాణ సంస్థ ప్రధాన కార్యాలయంలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం పై సమీక్ష నిర్వహించారు మంత్రి జోగి రమేష్. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి పక్కా గూడు కల్పించాలని దూడ సంకల్పంతో ఈ పథకాన్ని సీఎం జగన్ అమలు చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే ఈ పథకం కింద ఐదు లక్షలకు పైగా నిర్మించినట్లు తెలిపారు జోగి రమేష్. మిగిలిన ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. నిర్మాణ పనులలో అలసత్వం వహించకూడదని ఆదేశించారు. ఇల నిర్మాణాలతో పాటు జగనన్న కాలనీలలో మౌలిక సదుపాయాల పనులను కూడా వేగవంతం చేయాలని కీలక ఆదేశాలు జారీ చేశారు జోగి రమేష్.