39.4 C
Hyderabad
Friday, April 25, 2025
spot_img

గుడ్‌న్యూస్‌.. తెలంగాణలో మరో కొత్త రైల్వే లైన్‌..!

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. దశాబ్దానికి పైగా పెండింగులో ఉన్న కరీంనగర్ – హసన్‭పర్తి రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం పచ్చ జెండా ఊపింది. నూతనంగా నిర్మించనున్న ఈ రైల్వే లైన్‭ నిర్మాణానికి సంబంధించి యుద్ద ప్రాతిపదికన రీ సర్వే చేసి నివేదిక సమర్పించాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav) రైల్వే ఉన్నతాధికారులను ఆదేశించారు. సర్వే నివేదిక వచ్చిన తర్వాత నిధులు కేటాయింపుతో పాటు రైల్వే లైన్‭ (Railway Line)నిర్మాణ పనుల ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay)శుక్రవారం ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి అశ్వీని వైష్ణవ్‭ను కలిసి ఈ రైల్వే నిర్మాణానికి సంబంధించి వినతి పత్రం అందజేయగా.. ఆయన సానుకూలంగా స్పందించారు.దీనితో పాటు కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లిలో ట్రైన్ ఆగేలా చర్యలు తీసుకోవాలని, ఆ ప్రాంతంలో స్టేషన్ ఏర్పాటు చేయాలని బండి సంజయ్ కేంద్రమంత్రిని కోరగా.. దీనిపై ఆయన సముఖత వ్యక్తం చేశారు. అక్కడ కొత్త స్టేషన్ ఏర్పాటుతో పాటు ట్రైన్లు ఆగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. 2013లో ఈ రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి సర్వే చేసినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ధిష్ట సమయంలోగా సరైన నిర్ణయం తీసుకోలేదన్నారు. అందువల్లే ఈ రైల్వే లైన్ అంశంలో ఎలాంటి పురోగతి లేకుండా పోయిందని చెప్పారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 13వ షెడ్యుల్‭లోని ఐటం నెంబర్-11 ప్రకారం తెలంగాణను అభివృద్ధి చేయాలని అన్నారు. దాదాపు 62 కి.మీల పొడవు గల కరీంనగర్ -హసన్‭పర్తి రైల్వే లైన్‭ నిర్మాణం పూర్తయితే.. ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాల ప్రజలకు ఎంతో ప్రయోజనం ఉంటుందని బండి సంజయ్ వ్యాఖ్యనించారు.

Latest Articles

టిబిజెడ్ -ది ఒరిజినల్ స్టోర్ ను ప్రారంభించిన పాయల్ రాజ్ పుత్

హైదరాబాద్, 24 ఏప్రిల్, 2025: చరిత్ర, సంస్కృతి మరియు విలాసాలను మిళితం చేసే ఒక ముఖ్యమైన సందర్భంలో భాగంగా, భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన ఆభరణాల బ్రాండ్ అయిన టిబిజెడ్ -ది ఒరిజినల్, నేడు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్