Global Investors Summit: రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తోంది. ఉదయం 9గంటల 45 నిమిషాలకు ఈ సదస్సు ప్రారంభం అవుతుంది. 46 దేశాల నుంచి 15వేలమంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారు. మధ్యాహ్నం పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమవుతారు. పేర్గాంచిన 35మంది పారిశ్రామిక వేత్తలు కూడా ఈ సదస్సులో పాల్గొంటారు. 2లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను సాధించడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
రెండు రోలపాటు జరిగే ఈ ప్రపంచ పెట్టుబడుల సదస్సులకు ఇన్వెస్టర్స్ నుంచి ఊహించని స్పందన వచ్చిందని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే 12వేలకు పైగా రిజిస్ట్రేషన్ జరాగాయని, దేశంలోని టాప్-35 ఇండస్ట్రియలిస్ట్‌లు, 25 కంట్రీస్ నుంచి బిజినెస్ టైకూన్స్, హైకమిషనర్లు ఈ సమ్మిట్‌కి హాజరుకాబోతున్నారు. అంబానీ, అదానీ, మిట్టల్, బజాజ్, ఆదిత్యా బిర్లా, జిందాల్, జీఎంఆర్ లాంటి అనేకమంది పారిశ్రామిక దిగ్గజాలు 25 ప్రత్యేక విమానాల్లో ఈ సమ్మిట్‌కి రాబోతున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా మంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్‌రెడ్డి హాజరుకానున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహిస్తోంది. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ వేదికగా శుక్రవారం, శనివారం రెండురోజులపాటు ఈ సమ్మిట్ కోసం భారీ ఏర్పాట్లు చేసింది ఏపీ ప్రభుత్వం. దేశ విదేశాల నుంచి రాబోతున్న కార్పొరేట్ దిగ్గజాలకు కనీవినీ ఎరుగని రీతిలో ఏపీ ప్రభుత్వం రెడ్ కార్పెట్ ఆహ్వానం పలుకుతోంది. రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్‌కి సర్వంసిద్ధం చేసింది. ఈ సమ్మిట్ కు 25 దేశాల నుంచి హైకమిషనర్లు, 15వేల మంది ప్రతినిధులు. ఇండియా నుంచి 35మంది టాప్ ఇండస్ట్రియలిస్ట్‌లు, బిజినెస్ టైకూన్స్, కార్పొరేట్ దిగ్గజాలు. ఏడుగురు కేంద్ర మంత్రులు, వీవీఐపీలు హాజరుకానున్నారు.