అసెంబ్లీలో అధికార పార్టీ సభ్యులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. అసెంబ్లీలో మాట్లాడటానికి మైక్ కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు ఇటీవల ఎక్కువగా పెరిగాయని అన్నారు. అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతుంటే సీఎం మాట్లాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హామీలను నమ్మి ఆడబిడ్డలు ఓటేశారన్న సబితా.. వైఎస్‌ఆర్, చంద్రబాబు, కేసీఆర్ మహిళలకు సభలో ఎంతో గౌరవం ఇచ్చేవారని గుర్తు చేశారు.