హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో విగ్రహాల ముసుగు తొలగింపు దిశగా చర్చలు సాగుతు న్నాయి. రాజకీయ కారణాలతో ఏళ్ల కొద్దీ ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ విగ్రహావిష్కరణకు నోచుకో కుండా ముగ్గురు మహానీయుల విగ్రహాలు ముసుగులతో కార్యాలయం ఎదుట దర్శనమి స్తున్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాల యంలో ఏర్పాటు చేయాలని అప్పటి పాలకవర్గం నిర్ణయించి విగ్రహాన్ని సిద్ధం చేసింది. 2010 జులైలో వైఎస్సార్ జయంతి సందర్భంగా విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అయితే ఆవిష్కరణ జరిగేలోగా రాజకీయ సమీకర ణలు మారడంతో ఆవిష్కరణ కార్యక్రమం నిలిచిపోయింది. వైఎస్ విగ్రహాన్ని అక్కడ ఉంచరాదనే ఉద్దేశంతో అడ్డుపడ్డ కొందరు టీడీపీ నేతలు గాంధీ, అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేయాలని పట్టుబట్టారు. అయితే ఆ విగ్రహాలు కూడా తయారవగా మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలను వైఎస్ విగ్రహం కంటే తక్కువ ఎత్తువి తెచ్చి వైఎస్ విగ్రహానికి దిగువన ఉంచడం తో ఆవిష్కరణలు ఆగిపోయాయి. దీంతో మూడు విగ్రహాలను ముసుగులతో కప్పేశారు. ఆ తర్వాత అప్పటి మేయర్ బండ కార్తీకరెడ్డి వైఎస్ విగ్రహావిష్కరణకు ప్రయత్నించారు. ఎవరి గౌరవానికీ భంగం వాటిల్లకుండా ఉండేందుకు మూడు విగ్రహాలను జీహెచ్‌ఎంసీ ఆవరణలోనే వేర్వేరు చోట్ల ప్రతిష్టించాలని నిర్ణయించి స్టాండింగ్ కమిటీలో ఆమోదం పొందారు. అయితే ఎప్పటికప్పుడు రాజకీయ సమీకరణాలు మారిపోవడం, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావడంతో రోజులు గడిచినా ఆచరణకు నోచుకో కుండా పోయింది. మళ్లీ ఇన్నాళ్లకు విగ్రహావిష్కరణలపై చర్చలు సాగుతుండటంతో ముసుగులు తొలిగే అవకా ముంది. ఈ నేపథ్యంలోనే మేయర్ గద్వాల విజయలక్ష్మీని కలిసి చర్చలు జరిపారు ఉద్యోగ సంఘాల నేతలు. ముసుగులతో విగ్రహాలు ఉండటం ఇబ్బందిగా ఉందని భావించిన మేయర్ విజయ లక్ష్మీ ముసుగుల తొలగింపునకు ఉపక్రమించారు. అయితే కార్యాలయ ప్రాంగణంలోని మరోచోట విగ్రహా లు ఏర్పాటు చేయాలని కొందరు అభిప్రాయపడుతుండగాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేస్తే చాలని ఇంకొందరు పట్టుబడుతున్నారు. ఈ విషయంపై ఏకగ్రీవ నిర్ణయానికి రావాలని సూచిం చారు. దీంతో త్వరలోనే విగ్రహాలు ముసుగు తొలిగి ఆవిష్కరణకు నోచుకునే అవకాశమున్నట్టు తెలు స్తోంది.