కొమురంభీం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాడీవేడీగా సాగింది. జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ వెంకటేష్ దోత్రే అధ్యక్షతన నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. జిల్లాలో అధికారులు సరిగా పనిచేయడం లేదని సభ్యులు నిలదీశారు. ఆర్ అండ్ బి, ఫారెస్ట్, వ్యవ సాయ అధికారులు నిర్లక్ష్యం జిల్లా ప్రజలకు శాపంగా మారిందని మండిపడ్డారు. పనులలో నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని సభ్యులు సూచించారు. ఫారెస్ట్ అధికారులపై ఎమ్మెల్యే కోవలక్ష్మి మండిపడ్డారు. పోడు భూములను ట్రాక్టర్లతో దున్ననివ్వకుండా అడ్డుకుంటూ.. గ్రామాల్లో బోర్లను వేయనీయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.