ఉమ్మడి గుంటూరు జిల్లాలో GBS సిండ్రోమ్ కలకలం రేపుతోంది. జిల్లా వ్యాప్తంగా ఏడు కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మరో ఐదుగురు బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇటీవల మహారాష్ట్రలో 172 జీబీఎస్ కేసుల్లో ఏడుగురు మృతి చెందడం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. జీబీఎస్ సోకిన వారికి కాళ్ళు , చేతులు చచ్చుబడటం, ఊపిరి తీసుకోవడంలొ ఇబ్బందులు వంటి లక్షణాలు కలిగి ఉంటారని వైద్యులు చెబుతున్నారు. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో జీబీఎస్ బాధితులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.