సిద్ధిపేట జిల్లాలో గ్యాస్ ఏజెన్సీల అరాచకం రోజురోజుకు పెచ్చుమిరుతోంది. గ్యాస్ ఏజెన్సీలు, రీఫిల్లింగ్ నిర్వాహకులు కుమ్మక్కై ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రభుత్వం ప్రజలకు గృహూపయోగాల కోసం డొమెస్టిక్ సిలిండర్లను సబ్సిడీ ఇస్తోంది. అయితే గ్యాస్ ఏజెన్సీలు ఒక్కో సిలిండర్‌కి అదనంగా వెయ్యి రూపాయలు కమీషన్ తీసుకుంటూ…రీఫిల్లింగ్ చేసే వ్యక్తులకు ఇస్తూ అక్రమ ధనార్జనకి పాల్పడుతున్నారు. ఈనేపథ్యంలోనే ఓ నిర్వాహకుడు మీడియా కంటపడడంతో ఏం చేసుకుంటారో చేసుకోండంటూ బెదిరింపులకు దిగారు. అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రాలపై ఉక్కుపాదం మోపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


