స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ‘మై విలేజ్ షో’, ‘బిగ్ బాస్’ ఫేమ్ గంగవ్వ క్షమాపణలు చెప్పారు. అందరికీ నమస్కారండి.. నేను పెద్దగా చదువుకోలేదు. ఆ సారును నేను అనను అంటే ఆ టీవీ ఛానల్ వాళ్లు అనిపించారని తెలిపారు. మీరు తప్పుగా అనుకోవద్దు. క్షమించండి. నాకు ఏం తెలవదు.. వాళ్లు అనమంటేనే అన్నా. మీ అందరి వల్లే నాకు ఇంత పేరు, గూడు వచ్చింది. నేను మాట జారితే క్షమించడయ్యా అంటూ గంగవ్వ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం చంద్రబాబుకు గంగవ్వ క్షమాపణలు చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అసలు ఏం జరిగిదంటే.. ఉగాది పండుగ సందర్భంగా ఓ టీవీ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో గంగవ్వ పాల్గొన్నారు. కొందరు ప్రముఖుల ఫొటోలు చూపించి జాతకాలు చెప్పమన్నారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్ ఫొటోలు కూడా చూపించారు. ఆ ఫోటోలను చూసి వారు చంద్రబాబు, లోకేశ్ అని చెప్పిన గంగవ్వ.. వారి జాతకాలను మాత్రం చెప్పనన్నారు. కానీ ఛానల్ సిబ్బంది అదే పనిగా అడగడంతో ‘చంద్రబాబుకు గ్రహణం పట్టింది’ అని గంగవ్వ అన్నారు. దీంతో ఆ ఒక్క మాటను ఎడిటింగ్ చేసి టీడీపీ ప్రత్యర్థ పార్టీలు తెగ వైరల్ చేశాయి. దీంతో గంగవ్వ వివరణ ఇస్తూ చంద్రబాబుకు క్షమాపణలు చెప్పారు.