గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ మీదున్న అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు.
https://x.com/GameChangerOffl/status/1851935931911082410
డిఫరెంట్ ప్రమోషనల్ ప్లానింగ్‌తో మూవీపై అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా ఈ మూవీ టీజర్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 9న ‘గేమ్ ఛేంజర్’ టీజర్‌ను విడుదల చేస్తున్నారు. దీంతో మెగాభిమానులు, సినీ ప్రేక్షకుల్లో ఎగ్జయిట్‌మెంట్ మరింత పెరిగింది. టీజర్ రిలీజ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ గమనిస్తే రైల్వే ట్రాక్‌పై రామ్‌చరణ్ కూలింగ్ గ్లాస్ పెట్టుకుని లుంగీ, బనియన్‌తో పక్కా మాస్ లుక్‌లో కూర్చున్న రామ్ చరణ్‌ను చూడొచ్చు.
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ లుక్ ఉన్న పోస్టర్‌ను పోస్ట్ చేసి గేమ్ చేంజర్‌లో ట్రైన్ ఫైట్ ఉండబోతుందని, ఆ ఫైట్ అందరి అంచనాలను మించేలా ఉంటుందని చెప్పటంతో అంచనాలు నెక్ట్స్ లెవల్‌కు చేరుకున్నాయి.
https://x.com/MusicThaman/status/1851940857487695948
మూవీ నుంచి ఇప్పటికే వదిలిన పోస్టర్స్, ‘జరగండి జరగండి..’, ‘రా మచ్చా మచ్చా’ సాంగ్స్‌కు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చాయి. డైరెక్టర్ శంకర్ లార్జర్ దేన్ లైఫ్ సినిమాలను తెరకెక్కించటమే కాకుండా, అభిమానులకు, ప్రేక్షకులకు సినిమా డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుంటారు. రామ్ చరణ్‌లాంటి మాస్ హీరో ఉన్నప్పుడు ఆ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఎలా ఉంటుందో చూడాలని మెగాభిమానులు, మూవీ లవర్స్ ‘గేమ్ ఛేంజర్’ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన తెరకెక్కించిన సినిమాలను మించేలా ‘గేమ్ ఛేంజర్’ను ఆయన రూపొందిస్తున్నారు. పవరఫుల్ రోల్ లో చరణ్‌ను ప్రెజెంట్ చేస్తున్నారు శంకర్.
రామ్ చరణ్ కెరీర్‌లోనే హయ్యస్ట్‌గా గేమ్ చేంజర్ సినిమా నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను AA ఫిల్మ్స్ ఫ్యాన్సీ రేటుకి సొంతం చేసుకుంది. ఈ భారీ చిత్రానికి తమన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ప్రముఖ ఆడియో కంపెనీ సారేగమ ఈ సినిమా ఆడియో రైట్స్‌ను ఫ్యాన్స్ ప్రైజ్‌కి దక్కించుకుంది.
నటీ నటులు:
రామ్ చరణ్, కియారా అద్వానీ, అంజలి, సముద్రఖని, ఎస్.జె.సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర తదితరులు
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: శంకర్, నిర్మాణ సంస్థలు: శ‌్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్, రైటర్స్: ఎస్.యు.వెంకటేశన్, వివేక్, స్టోరీ లైన్: కార్తీక్ సుబ్బరాజ్, కో ప్రొడ్యూసర్: హర్షిత్, సినిమాటోగ్రఫీ:ఎస్.తిరుణావుక్కరసు, మ్యూజిక్: తమన్.ఎస్, డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా, లైన్ ప్రొడ్యూసర్స్: నరసింహారావ్.ఎన్, ఎస్.కె.జబీర్, ఆర్ట్ డైరెక్టర్: అవినాష్ కొల్ల, యాక్షన్ కొరియోగ్రాఫర్: అన్బరివు, డాన్స్ కొరియోగ్రాఫర్స్: ప్రభుదేవా, గణేష్ ఆచార్య, ప్రేమ్ రక్షిత్, బాస్కో మార్టిస్, జానీ, శాండీ, లిరిసిస్ట్: రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్, కాసర్ల శ్యామ్, ఎడిటర్: షామీర్ ముహ్మద్, సౌండ్ డిజనర్: టి.ఉదయ్‌కుమార్, పి.ఆర్.ఒ: నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా)