Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

గగన్‌యాన్ వీరులు

     భారత్ మరో అంతరిక్షయాత్రకు సన్నద్ధమైంది. గగన్‌యాన్ యాత్రకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రయత్నా లు మొదలెట్టింది. గగన్‌యాన్ అంటే చిన్నాచితకా యాత్ర కాదు. భారత్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టి న తొలి మానవసహిత అంతరిక్ష యాత్రే…గగన్‌యాన్. గగన్‌యాన్ ప్రాజెక్టు ఇప్పటిది కాదు. 2018లో ప్రధాని నరేంద్ర మోడీ ఈ ప్రాజెక్టును ప్రక టించారు. గగన్‌యాన్ అంటే సంస్కృతంలో అంతరిక్ష నౌక అని అర్థం. ఇది మానవ సహిత అంతరిక్ష యాత్ర. గగన్‌ యాన్ మిషన్‌లో ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపుతారు. మూడు రోజుల పాటు అంతరిక్షంలోనే ఉంచు తారు. ఆ తరువాత సదరు వ్యోమగాములను సురక్షితంగా భూమికి తీసుకువస్తారు. స్థూలంగా ఇదీ గగన్‌యాన్ మిషన్‌.

     వాస్తవానికి గగన్‌యాన్ మిషన్‌ను 2021లో అమలు చేయాలన్నది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఆలోచన. అయితే కరోనా మహమ్మారి విజృంభించిన కారణంగా 2021లో ప్రయోగానికి బ్రేకులు పడ్డాయి. గగన్‌యాన్ మిషన్‌కు అనేక ప్రత్యేకతలున్నాయి. వ్యోమగాములకు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు, వారు సురక్షితంగా భూమికి చేరుకోవడానికి వీలుగా క్రూ ఎస్కేప్ సిస్టమ్‌ అనే కొత్త పరికరాన్ని రూపొందించారు. అలాగే భారత సముద్ర జలాల్లో ల్యాండ్ చేయడం ద్వారా వ్యోమగాములను సురక్షితంగా భూమికి తిరిగి తీసుకురావాలన్నది ఇస్రో ఆలోచన. దీనికోసం ఎల్వీఎం త్రీని లాంచ్ వెహికిల్‌గా ఉపయోగిస్తున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు.

       ఇదిలాఉంటే తాజాగా గగన్‌యాన్ కోసం ఎంపికైన వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. మన వైమానికదళానికి చెందిన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లాలను అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములుగా ఎంపిక చేశారు. భారత భూభాగం నుంచి స్వదేశీ వ్యోమ నౌకలో అంతరిక్ష యాత్ర చేయనున్న భారతీయ బృందం గా ఈ నలుగురు చరిత్ర సృష్టించబోతున్నారు. తిరువనంత పురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో ఈ నలుగురు వ్యోమగాములను ప్రధాని నరేంద్ర మోడీ అందరికీ పరిచయం చేశారు. ఈ నలు గురు వ్యోమగాములను కోట్లాదిమంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలను రోదసీలోని తీసుకెళ్లే నాలుగు శక్తులుగా ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. ఈసారి కౌంట్‌డౌన్ మనదే…టైమింగ్ మనదే. ..రాకెట్ మనదే ….అని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.

    భారత అంతరిక్ష యాత్రల్లో గగన్‌యాన్‌కు ఒక ప్రత్యేకత ఉంది. గగన్‌యాన్ యాత్ర 2025లో ప్రారంభం కానుంది. ఈ రోదసీ యాత్రలో వ్యోమగాములను 400 కిలోమీటర్ల ఎత్తులో భూకక్ష్యలోకి పంపుతారు. దీనికోసం ఎల్వీఎం – మార్క్‌ 3 రాకెట్‌ను ఉపయోగించనున్నారు. రోదసీలోకి వెళ్లాక దాదాపు మూడు రోజుల తరువాత ఈ నలుగురు వ్యోమగాములు తిరిగి భూమికి తిరిగివస్తారు. తిరుగు ప్రయాణంలో వ్యోమ నౌక సముద్రజలాల్లో ల్యాండ్ అవుతుంది. గగన్‌యాన్ యాత్ర విజయవంతమైతే మానవసహిత అంతరిక్ష యాత్రల సామర్థ్యం కలిగిన అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్ చేరుతుంది. గగన్‌యాన్ ప్రాజెక్ట్‌కు దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ప్రభుత్వ వర్గాల అంచనా. గగన్‌యాన్ యాత్రకు ఎంపికైన నలుగురు వ్యోమగాములు యుద్ధ విమాన పైలట్లుగా వాయుసేనలో అద్భుత ప్రతిభను చాటారు. వారికి దాదాపుగా రెండు వేల నుంచి మూడు వేల గంటల గగనవిహార అనుభవం ఉంది. పూణే కు సమీపంలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీకి ఎంపికయ్యారు. అక్కడ ట్రైనింగ్ పూర్తి చేసుకుని పైలట్ శిక్షణ కోసం హైదరాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీకి వెళ్లారు.అనేక అగ్రశ్రేణి యుద్ధ విమానాలను నడిపిన అనుభవం వారి స్వంతం. అంతేకాదు రష్యాలో 13 నెలల పాటు వ్యోమగామి శిక్షణ కూడా పొందారు. ఆ తరువాత ఈ నలుగురూ స్వదేశంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థలో శిక్షణ పొందారు.

       ఇక గగన్‌యాన్ యాత్రకు ఎంపికైన వారిలో ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ తొలి వ్యక్తి. ఎయిర్‌ఫోర్స్ అకాడమీలోని అన్ని విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ చాటారు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్. స్వోర్డ్ ఆఫ్ ఆనర్ అవార్డు దక్కించుకు న్నారు. 1998 డిసెంబర్‌లో వాయసేనలో పైటర్ పైలట్‌గా చేరారు. కెరీర్‌ పరంగా మొత్తం మూడు వేల గంటల ప్లయింగ్ అనుభవాన్ని సాధించారు బాలకృష్ణన్ నాయర్. అంతే కాదు కేటగిరీ – ఏ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్‌ హోదాను కూడా నాయర్ పొందారు. అజిత్ కృష్ణన్ …గగన్‌ యాన్‌ ఎంపికకు ఎన్నికైన మరో వ్యోమగామి ఈయన. ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో రాష్ట్రపతి బంగారు పతకం, స్వోర్డ్‌ ఆఫ్ ఆనర్ గెలుచుకున్నాయి. యుద్ధ విమానాల చోదకుడిగా 2,900 గగనవిహార అనుభ వాన్ని గడించారు. ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్‌ హోదాను అజిత్ కృష్ణన్ సాధించారు. గగన్‌యాన్ రోదసీ యాత్రకు ఎంపికైన వారిలో అంగద్ ప్రతాప్ కూడా ఉన్నారు. 2004 డిసెంబర్‌లో ఫైటర్ పైలట్‌గా వాయుసేనలోకి అంగద్ ప్రతాప్ ప్రవేశించారు. దాదాపు రెండు వేల గంటల ఫ్లయింగ్ అనుభవాన్ని అంగద్ ప్రతాప్ సాధిం చారు. ఇక చివరి వ్యక్తి …శుభాన్షు శుక్లా. ఈయన 2006 జూన్‌లో ఫైటర్ విమానాల పైలట్‌గా చేరారు. దాదాపు రెండు వేల గంటల గగనవిహార అనుభవం పొందారు శుభాన్షు శుక్లా.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్