స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రజా యుద్ద నౌక గద్దర్ పార్థివ దేహానికి పలువురు నివాళులు అర్పించారు. గద్దర్ అంతిమయాత్ర మధ్యాహ్నం 12 గంటలకు ఎల్బీనగర్ స్టేడియం నుంచి ప్రారంభం కానుంది. కళాకారులతో భారీ ర్యాలీగా గద్దర్ పార్థివదేహాన్ని తీసుకెళ్లనున్నారు. కళాకారులు, ఉద్యమకారులు, పలు రాజకీయ పార్టీ నేతలు ఈ అంతిమయాత్రలో పాల్గొననున్నారు. స్టేడియం నుంచి బషీర్‌బాగ్ చౌరస్తా, జగ్జీవన్‌రామ్ విగ్రహం మీదుగా.. గన్‌పార్క్ వైపు సాగనుంది. గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్దకు గద్దర్ పార్ధివ దేహం చేరుకోగా.. కాసేపు అక్కడ పాటలతో కళాకారులు నివాళులు అర్పించనున్నారు. అనంతరం అమరవీరుల స్థూపం నుంచి సికింద్రాబాద్ మీదుగా భూదేవినగర్‌లోని తన నివాసానికి చేరుకోనుంది. అల్వాల్ మహాబోధి గ్రౌండ్స్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.
తెలంగాణలోని తూఫ్రాన్ లో 1949 లో పుట్టిన గద్దర్ వయసు 74 ఏళ్లు. తన జీవిత కాలమంతా పాటై ప్రవహించాడు గద్దర్. ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. జీవితమంతా కష్టాలు పడ్డాడు. కానీ తాను నమ్మిన సిద్దాంతం కోసం చివరి దాకా పోరాడాడు. పాటతోనే ప్రవహించాడు. ప్రజలను నిత్యం చైతన్యవంతం చేసేందుకు కృషి చేశాడు.


